విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా- మళ్లీ ఎప్పుడో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంబోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 4న ఈ ఫ్లైఓవర్‌ ను కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ కరోనా కారణంగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించాల్సి ఉంది. అంతకు ముందే ఈ ప్లైఓవర్‌ విశిష్టతను దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పేలా కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది.

Recommended Video

AP 3 Capitals పై High Court స్టేటస్ కో మళ్లీ పొడిగింపు- ఏపీ వికేంద్రీకరణ! || Oneindia Telugu

కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకస్మిక మృతితో కనకదుర్గ ఫ్లైఓవర్‌ కార్యక్రమం వాయిదా పడింది. ప్రణబ్‌ మృతికి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలూ నిర్వహించరు. దీంతో సహజంగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న నగర వాసులకు నిరాశ తప్పలేదు.

vijayawada kanaka durga flyover opening postponed due to pranabs demise

ప్రణబ్‌ మృతికి సంతాపంగా వారం రోజుల పాటు అధికారిక కార్యక్రమాలేవీ జరిగే అవకాశం లేకపోవడంతో ఈ వారం ముగిశాక ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి కొ్త్త తేదీని కేంద్రం ప్రకటించనుంది. ఆ మేరకు మళ్లీ అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ నెల రెండో వారంలో ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశముంది.

English summary
prestigious vijayawada kanakadurga flyover opening ceremony has been postponed due to sudden demise of former president pranab mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X