• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇంద్రకీలాద్రిపై దసరా శోభ-బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు-హీరోయిన్ శ్రీయ సహా వీఐపీల దర్శనం

|
Google Oneindia TeluguNews

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల రెండో రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి పలువురు వీఐపీలతో పాటు సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని మంత్రి గుమ్మనూరు జయరాం, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సినీ నటి శ్రీయ కూడా దర్శనం చేసుకున్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మ వారి ఆశీస్సులు అందరూ పైన ఉండాలని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు..

vijayawada kanakadurga appearing as balatripura sundari on second day of dussehra sarannavaratris

అమ్మవారిని బాలాత్రిపురసుందరి దేవిగా దర్శించుకోవడం సకల శుభకరమని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. అందరూ అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు ఇతర రాష్ట్రాల నుంచీ దసరాకి ఎక్కువమంది వస్తుంటారని, బస్ ఛార్జీలు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఇతర రాష్ట్రాల బస్ ఛార్జీల కంటే ఒక రూపాయి తక్కువే ఉండేలా చూస్తున్నామన్నారు.

vijayawada kanakadurga appearing as balatripura sundari on second day of dussehra sarannavaratris

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో వున్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి సినీనటి శ్రీయ దర్శించుకున్నారు.

ఆ తర్వాత కార్మిక శాఖామంత్రి గుమ్మనూరు జయరాం కూడా దర్శనానికి వచ్చారు. బాలాత్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనంద దాయకమని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అమ్మవారి దర్శనం చేసుకొని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. కరోనా నుంచీ దూరమై అందరూ ఆనందంగా ఉండాలన్నారు. కార్మికులకు అన్ని సదుపాయాలు మా ప్రభుత్వం అందిస్తోందని జయరాం తెలిపారు.

  AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu

  నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా అమ్మవారు దర్మనిస్తున్నారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
  అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.త్రిపుర సుందరి అంటే " మనలోని ముడు
  అవస్థలూ...జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
  ఈ ముడు అవస్థలు ...లేద పురములకు బాల అధిష్ఠాన దేవత!

  ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ...."బాలగా.."....అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
  అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది....ఆవిడ ఆత్మ స్వరూపురాలు....ఆవిడను పూజిస్తే....ఙ్ఞానము కలిగి .. ...తానె శివ స్వరూపము తో...చైతన్యము ప్రసాదించి...మోక్షమునకు...అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది...ఈ కరుణామయి..
  సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి.

  English summary
  on dussehra sarannavaratris second day, vijayawada kanakadurgamma has been appearing as bala tripura sundari avatar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X