వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోటు ప్రమాదం: 8 మంది అరెస్ట్, మళ్ళీ అదే నిర్లక్ష్యం

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఫెర్రీ ప్రమాద ఘటనకు కారణమైన నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు అధికారులు ఎవరైనా బాద్యులని తేలితే వారిపై చర్యలు తీసుకొంటామని విజయ వాడ పోలీసులు ప్రకటించారు.

బోటు ప్రమాదం: లైసెన్సులన్నీ రద్దు, ఏడుగురిపై వేటుబోటు ప్రమాదం: లైసెన్సులన్నీ రద్దు, ఏడుగురిపై వేటు

Recommended Video

Krishna Boat Tragedy : Shocking Facts, తీగ లాగితే డొంకంతా కదిలింది | Oneindia Telugu

ఈ నెల 12వ, తేదిన ఫెర్రీ వద్ద బోటు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకొంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది.

బోటు ప్రమాదం: సాగర్ టూ శ్రీశైలం బోట్ల రద్దు, ''బాబు షూ వల్లే ఇదంతా''..బోటు ప్రమాదం: సాగర్ టూ శ్రీశైలం బోట్ల రద్దు, ''బాబు షూ వల్లే ఇదంతా''..

ఈ ఘటనకు సంబంధించిన ఏడుగురు ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. పోలీసు శాఖ ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

బోటు ప్రమాదం: డ్రైవర్ గేదేల శ్రీనుపై వేటు, నిర్లక్ష్యమే కారణంబోటు ప్రమాదం: డ్రైవర్ గేదేల శ్రీనుపై వేటు, నిర్లక్ష్యమే కారణం

ఫెర్రీ ఘటనలో 8 మంది అరెస్ట్

ఫెర్రీ ఘటనలో 8 మంది అరెస్ట్

ఈ నెల 12వ, తేదిన ఫెర్రీ ఘటనపై 8మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన గేదేల శ్రీను, గేదేల లక్ష్మి, కొండలరావు, శేషగిరిరావు, వింజమూరి విజయసారధి, మాచవరపు మనోజ్, శేషగిరిరావు, బైరవ స్వామిని అరెస్ట్ చేశారు.నిందితులపై ఐసిపీ 304 తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

 లైఫ్ జాకెట్లు లేవు

లైఫ్ జాకెట్లు లేవు

ఫెర్రీ వద్ద ఈ నెల 12వ, తేదిన జరిగిన బోటు ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడానికి లైఫ్ జాకెట్లు లేకపోవడమే ప్రధాన కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.బోటులో ఒక్క లైఫ్ జాకెట్ మాత్రమే ఉందని పోలీసులు ప్రకటించారు. అంతేకాదు ఈ బోట్‌లో కనీస ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని పోలీసులు ప్రకటించారు.

డ్రైవర్‌కు అవగాహన లేదు

డ్రైవర్‌కు అవగాహన లేదు

ఫెర్రీ ప్రమాదానికి డ్రైవర్ నిర్ణక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు తేల్చారు. బోటును నడిపిన గేదేల శ్రీనుకు ఈ ప్రాంతంపై అవగాహన లేదన్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో బోటు నడిపే విషయమై డ్రైవర్ తెలుసుకొనే ప్రయత్నం కూడ చేయలేదని పోలీసులు ప్రకటించారు.ఈ కేసుకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఏ మాత్రం ఉందనే కోణంలో కూడ విచారణ జరుపుతున్నట్టు పోలీసులు ప్రకటించారు.

ప్రమాదస్థలంలో మళ్ళీ అదే నిర్లక్ష్యం

ప్రమాదస్థలంలో మళ్ళీ అదే నిర్లక్ష్యం

ఈ నెల 12వ, తేదిన ఫెర్రీ వద్ద బోటు మునిగిపోయి 22 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కృష్ణా నదికి హరతి ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపివేశారు. 22 మంది కృష్ణానదిలో చనిపోయినందున అర్చకులతో శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ప్రమాదస్థలానికి పడవలో అర్చకులను అధికారులు తీసుకెళ్ళారు. బోటులో లైఫ్ జాకెట్లు ఉన్నా ఎవరూ కూడ వేసుకోలేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్న సమయంలో కూడ అధికారులు జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రమాదస్థలంలో ఉదకశాంతి, రుద్రాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు.

లైసెన్స్ లేని బోటులో బాబు, లోకేష్ ప్రయాణిస్తారా

లైసెన్స్ లేని బోటులో బాబు, లోకేష్ ప్రయాణిస్తారా

ఫెర్రీ ప్రమాద ఘటనపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనలో 21 మంది మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. లైసెన్స్ లేని బోటుల్లో చంద్రబాబునాయుడు, లోకేష్ ప్రయాణం చేస్తారా అని జగన్ ప్రశ్నించారు.

English summary
Vijayawada police arrested 8 members for Ferry boat accident. Vijayawada police commissioner spoke to media on Wednesday evening at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X