విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపికి షాక్: టాప్ 100 ట్యాక్స్ డిఫాల్టర్స్ లిస్ట్‌లో కేశినేని, జలీల్ ఖాన్, ఉమ

ఏపీలోని విజయవాడలో చాలామంది ప్రముఖులు ట్యాక్స్ డిఫాల్టర్ జాబితాలో ఉన్నారు. ఈ లిస్టులో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు తదితరులు కూడా ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీలోని విజయవాడలో చాలామంది ప్రముఖులు ట్యాక్స్ డిఫాల్టర్ జాబితాలో ఉన్నారు. ఈ లిస్టులో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు తదితరులు కూడా ఉన్నారు.

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ (వీఎంసీ) ప్రకారం.. విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సహా పలువురు టాప్ 100 మంది ప్రాపర్టీ డిఫాల్టర్స్ జాబితాలో ఉన్నారు.

వీఎంసీలో రావాల్సిన ట్యాక్స్‌లో సగం కూడా రావడం లేదు. 164.81 కోట్లకు గాను కేవలం రూ.71.01 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది 43.09 శాతం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కావడానికి మరో 20 రోజులు ఉంది.

Vijayawada politicos are top tax defaulters

ఈ సమయంలో 100 మంది టాప్ డిఫాల్టర్స్ పేరును వీఎంసీ ప్రకటించింది. సర్కిల్ 1లో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టాప్ డిఫాల్టర్‌గా ఉన్నారు. ఆయన రూ.14,86,358 ట్యాక్స్ కట్టాల్సి ఉంది.

విజయవాడ ఎంపీ కేశినేని నాని రూ.9,44,505 కట్టాల్సి ఉంది. నాని 2015 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు కూడా పన్ను కట్టాల్సి ఉంది.

బండారు రోడ్డులోని తన ప్రాపర్టీకి ఏప్రిల్ 2016 నుంచి కట్టలేదు. ఆయన డ్యూ మొత్తం రూ.28,02,606గా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ రూ.14,07,899 డ్యూ కట్టాల్సి ఉంది. అలాగే, పలు విద్యాసంస్థలు కూడా డిఫాల్టర్స్ లిస్టులో ఉన్నాయి.

English summary
Many of the top tax defaulters in Vijayawada city are big shots, politicians and government establishments. Member of Parliament from Vijayawada, Kesineni Srinivas (Nani), Vijayawada central MLA Bonda Umamaheswar Rao and Vijaywada west MLA Jaleel Khan were also in the top 100 property tax defaulters list, according to the data given by Vijayawada Municipal Corporation (VMC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X