విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ పీవీపీ మాల్...భలే పని చేస్తోందే!:పాత రోజులు గుర్తుచేస్తుంది

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

పీవీపీ మాల్ పాత రోజులు గుర్తుచేస్తుంది

విజయవాడ:కాలం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది...అది అందరికీ తెలిసిన విషయమే...ఒక్కోకాలంలో ఒక్కో అంశం మనిషిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. అలా ఇప్పుడు జనాన్ని మేనియాలాగా పట్టి ఊపేస్తోంది స్మార్ట్ ఫోన్...

చిన్నాపెద్దా...పేద ధనిక...ఆడ మగ తారతమ్యాలు లేకుండా మనుషులందరూ ఈ సెల్ ఫోన్ మాయలో పడి ఉర్రూతలూగిపోతున్నారు. ఆ క్రమంలో రియల్ లైఫ్ కు బాగా దూరమై పోయి స్క్రీన్ లైఫ్ కే పరిమితమవుతున్నారు...అయితే ఈ ట్రెండ్ వ్యక్తులకు ఎంతవరకు మేలు చేస్తుందో తెలియదు కానీ చాలా విధాలుగా నష్టాన్ని అయితే కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే దీనికి విరుగుడుగా తమ వంతు తోడ్పాటుగా ఒక కొత్త కార్యక్రమానికి తెరతీసింది విజయవాడ పివిపి మాల్.

పివిపి మాల్...గుర్తు చేస్తోంది

పివిపి మాల్...గుర్తు చేస్తోంది

రియల్ లైఫ్ కు దూరంగా వర్చువల్ లైఫ్ లోనే లీనమైపోతూ జనం బాహ్య ప్రపంచాన్నే మరిచిపోతుండటంతో తత్ఫలితంగా దెబ్బతింటున్నస్నేహసంబంధాలు... ఆప్యాయత...అనురాగాలు...అనుబంధాలు...వీటన్నింటిపై ఎవరో ఒక మనసున్న మనిషి ఆవేదన పివిపి మాల్ యాజమాన్యాన్ని కూడా కదిలించినట్లుంది. అందుకే దెబ్బతింటున్న మానవసంబంధాల్లో కొంతయినా పునరుద్దరిద్దాం అనే ఉద్దేశ్యంతో ఒక వెరైటీ ప్రోగ్రామ్ కు తమ మాల్ లో స్థానం కల్పించారు. అఫ్ కోర్స్ ఇందులో కూడా కమర్షియల్ యాంగిల్ ఉండొచ్చు!...అయినా కూడ ఎలాగైనా సొమ్ము చేసుకుందాం అని ఎంతకైనా తెగించే కార్పోరేట్ శైలికి కొంత భిన్నంగా ఒక పాజిటివ్ యాక్ట్ తో ఈ న్యూ అండ్ ఓల్డ్ కాన్సెప్ట్ ను ప్రారంభించింది.

ఇంతకూ...ఆ కార్యక్రమం ఏంటంటే?

ఇంతకూ...ఆ కార్యక్రమం ఏంటంటే?

పాత ఆటల ద్వారా పాత రోజులను...పాత జ్ఞాపకాలను గుర్తు చేయడం...ఎస్...అవునండి...అదే పివిపి మాల్ చేస్తోంది. అర్థం కాలేదా?...అయితే విజయవాడ ఆన్షియంట్ లివింగ్ స్టోర్ కు ఒక్కసారి వెళదాం...ఒక్కడ వారాంతపు రోజుల్లో మన పాతకాలపు...సాంప్రదాయ ఆటలను ఆ సంస్థ ప్రత్యేకంగా పరిచయం చేస్తోంది. ఆ ఆటలేంటో?...వాటితో మనకు సంబంధం ఏంటో...వాటి వల్ల మనకు ఉపయోగమేంటో?..మీరే చూద్దురుగాని!...

ఆ ఆటలివే...ఏమైనా గుర్తుకు వస్తున్నాయా?

ఆ ఆటలివే...ఏమైనా గుర్తుకు వస్తున్నాయా?

దాడి, పులిమేక, అష్ట చెమ్మ, జిగ్గాట, వామన గుంటలు, పచ్ఛిస్, చైనీస్ చెక్కర్ ఆటలను ఇక్కడ మళ్ళీ అందుబాటులో పెట్టారు. అవి వచ్చిన వాళ్లు సరదాగా ఆడేయొచ్చు...అవసరమైతే అచ్చం అప్పటిలాగే పందాలు కూడా కాయొచ్చు...అంతేకాదు...ఈ ఆటలు రానివాళ్లు...నేర్చుకుందామని ఆసక్తి చూపేవాళ్లకి ఈ ఆటలను నేర్పడానికి శిక్షణ పొందిన సిబ్బంది కూడా అక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటారా?...

ఏంటి ఉపయోగం...అంటారా?

ఏంటి ఉపయోగం...అంటారా?

ఈ కాసేపైనా ఫోన్ పక్కన పడేస్తూ ఎదుటి మనుషులతో చక్కగా కబుర్లు చెప్పుకొంటూ సరదాగా...పైలాపచ్చీస్ గా సమయం గడపొచ్చు...అప్పటి కబుర్లు...జ్ఞాపకాలు ఎంచక్కా నెమరువేసుకోవచ్చు...ఫోన్ తో కాకుండా ఆప్తులతో ముచ్చటిస్తూ ఆడే ఆటల్లో ఎంత సంతోషం ఉందో మరోసారి ఆ అనుభూతిని చవిచూడొచ్చు...ఈతరానికి తెలియచెప్పొచ్చు...కాదంటారా!..ఏదేమైనా క్షణం తీరిక లేకుండా సాగిపోయే సిటీ లైఫ్ లో ఎప్పుడూ బిజీగానే ఉండే తల్లిదండ్రలకు...చదువుల పోటీలో తలమునకలై అలసిసొలసే చిన్నారులకు...ఈ పాతతరం ఆటలను అందుబాటులోకి తెచ్చి అందరి అభినందనలు అందుకొంటోంది పీవీపీ ఆన్షియంట్ లివింగ్ స్టోర్...

English summary
Vijayawada: The Time is always change ...it is known to all...Every time one single factor plays key role over a man's life. So now it's a smart phone turn...In this background Vijayawada PVP Mall has made a Variety programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X