వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్ధుల సత్తా: విజయవాడ స్టూడెంట్ సూరజ్ కృష్ణ టాప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పేపర్ ఫలితాలను, అఖిల భారత ర్యాంకులను సోమవారం నాడు సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో తెలుగు విద్యార్ధులు తమ సత్తాను చాటారు. విజయవాడకు చెందిన సూరజ్‌ కృష్ణ ఫస్ట్‌ ర్యాంకు, విశాఖకు చెందిన హేమంత్‌కు రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌ కు గట్టు మైత్రేయకు ఐదో ర్యాంకు వచ్చింది.

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.50 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు.

Vijayawadas Suraj Krishna gets AIR 1 in JEE Main 2018

మెయిన్స్‌ కటాఫ్‌ ద్వారా 2.24 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు అర్హత సాధిస్తారు. వచ్చే నెల 20న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్‌ఈ బోర్డు సైతం జేఈఈ మెయిన్ 2018 ఫలితాలను cbseresults.nic.in, results.nic.in వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేయనుంది. మెయిన్స్‌ పేపర్‌-2 ఫలితాలను వచ్చే నెల 31న సీబీఎస్‌ఈ విడుదల చేయనుంది.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నా పరిస్థితి అలానే ఉంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్‌ 1.5 లక్షల మంది విద్యార్థులను గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకునేవారు. క్రమంగా దాన్ని టాప్‌ 2 లక్షలకు, టాప్‌ 2.2 లక్షలకు, ప్రస్తుతం టాప్‌ 2.24 లక్షలకు పెంచింది. అయినా సీట్ల మిగులు పెరుగుతోంది.

English summary
The results of the Joint Entrance Examination (JEE Main), formerly All India Engineering Entrance Examination (AIEEE) have been declared today, April 30, 2018. The CBSE JEE Main Results 2018 can be checked at cbseresults.nic.in and results.nic.in.Suraj Krishna from Vijayawada has secured All India (AIR) 1st rank in JEE Main 2018 in general category, as reported by AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X