విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచలనంగా మారిన విజయవాడ సరోగసి కేసు వివాదం:ఏం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లా:విజయవాడలో సరోగసి (అద్దె గర్భం) కేసు వివాదం సంచలనంగా మారింది. ఈ వివాదంలో వ్యక్తి హక్కులతో పాటు సామాజిక హితానికి సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ సరోగసి కేసు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.

ఇంతకీ ఈ వివాదం ఏమిటంటే?...తనకు ఒక హాస్పిటల్ వారు బలవంతంగా సరోగసి చేయడంతో పాటు అందుకుగాను వారిపై కేసు పెట్టినందుకు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేయడం వైద్య రంగంలో పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బాధితురాలికి మద్దతు అంతకంతకు పెరుగుతుండటంతో పాటు సరోగసి ముసుగులో జరుగుతున్న దారుణాలపై ఈ వివాదం చర్చకు కారణం అయింది. అసలేం జరిగిందంటే?....

 Vijayawada Surrogacy Case Dispute creating Sensation

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శ్రీదేవి అనే యువతి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు ఉద్యోగం అత్యవసరమని అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితురాలు సంధ్య అనే యువతికి తెలిపింది. దీంతో సంధ్య తనకు తెలిసిన కార్తీకదత్త ఆసుపత్రి వైద్యులు కొల్లు రమాదేవి, కొల్లు రాజేంద్రప్రసాద్‌లకు శ్రీదేవి ఆర్థిక ఇబ్బందులు వివరించి ఆమెకు ఇవ్వాలని కోరింది. దీంతో శ్రీదేవి పరిస్థితిని ఆకళింపు చేసుకున్న కార్తీకదత్త ఆసుపత్రి వైద్యులు కొల్లు రమాదేవి, కొల్లు రాజేంద్రప్రసాద్‌
ఆమెకు సరోగసి గురించి వివరించి...తద్వారా తక్కువ సమయంలో డబ్బు వస్తుందని చెప్పారు.

అయితే అందుకు ఆమె నిరాకరించడంతో సరే నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆగష్టు 8 న ఆస్పత్రికి రప్పించిన ఆసుపత్రి యాజమాన్యం ఆమెకు బలవంతంగా సరోగసి చేసేందుకు ఇంజక్షన్ ఇచ్చారని బాధితురాలు చెబుతోంది. అయితే ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఇక ఆమె సరోగసి ప్రక్రియకు ఒప్పుకోలేదట.
అయితే శ్రీదేవి సరోగసి నుంచి మధ్యలో విరమించుకోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆగ్రహించి ఆమెని నిర్బంధించి మరీ చికిత్స అందించారట. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది.

దీంతో అప్పట్లో పోలీసులు ఆస్పత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో వైద్యులు రమాదేవి, రాజేంద్రప్రసాద్‌ కొన్నిరోజుల పాటు పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నారు. ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్‌ తెచ్చుకున్నారు. ఒకవైపు ఈ కేసు పై విచారణ కొనసాగుతుండగానే కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ శ్రీదేవిపై వేధింపులు మొదలయ్యాయని తెలిసింది. దీంతో ఆమె భయపడి బంధువుల ఇళ్లలో తలదాచుకోగా...ఆస్పత్రి యాజమాన్యం తరపువారు ప్రతిరోజూ ఆమెకు ఫోన్‌ చేస్తూ 'నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను పట్టుకుంటాం, ఏమైనా చేస్తాం' అంటూ బెదిరింపులకు దిగుతున్నారట.

ఆ క్రమంలో ఏకంగా కిరాయి రౌడీలను కూడా తన ఇంటికి పంపించి బెదిరించాలరని...ఈ బెదిరింపుల విషయమై తాను పలుమార్లు పోలీసులను కలిసి విన్నవించినా, డిఎంహెచ్‌ఒకు కూడా ఫిర్యాదు చేసినా ఏ సహకారం అందలేదని బాధితురాలు వాపోయింది. ఈ నేపథ్యంలో వేధింపులు అధికం కావడంతో శ్రీదేవి సోమవారం ఇంట్లో నిద్రమాత్రలను మింగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు గమనించి విజయవాడ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో పోలీసులు స్పందిస్తూ సరోగసి కేసు కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఈ సరోగసి కేసు బాధితురాలి విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జాతీయ సంస్థలు సైతం ఈ సరోగసి వివాదంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

English summary
Vijayawada: A Surrogacy Case dispute takes new turn in Vijayawada. A married woman alleging that the Karthikadatta Hospital, which performed the procedure, has gobbled up the money, the family members of the woman odged a complaint with the police. Since then there have been pressures on the woman and her family members to withdraw the case. Unable to bear it any longer, the woman attempted suicide on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X