tdp leaders tdp atchannaidu keshineni nani buddha venkanna bonda uma chandrababu AP Municipal Elections 2021 AP Local Body Elections 2021 టీడీపీ నాయకులు టీడీపీ అచ్చెన్నాయుడు కేశినేని నాని బోండా ఉమా చంద్రబాబు politics
చంద్రబాబు జోక్యం, అచ్చెన్నాయుడు ఫోన్ .. విజయవాడ టీడీపీ నాయకుల పంచాయితీ ముగిసినట్టేనా ?
బెజవాడ టీడీపీ నేతల పంచాయితీ చిలికి చిలికి గాలివానగా మారింది . చెప్పుతో కొడతామని తీవ్ర ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళింది. చంద్రబాబుకి ఎవరు కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసే దాకా వెళ్లింది. టిడిపి నేతలు బాహాటంగానే మీడియా సమావేశం నిర్వహించి మరీ కేశినేని నానిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాము పని చేస్తుంటే పదవుల కోసం కేశినేని నాని పాకులాడుతున్నారని విమర్శించారు.

ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలను బుజ్జగించేందుకు అచ్చెన్నాయుడు యత్నం
టిడిపి నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మొదటి నుంచి కేశినేని నాని వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను విజయవాడ మేయర్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఇదిలా ఉంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్న టిడిపి నేతలను బుజ్జగించడానికి అధినేత ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు.

ఫోన్ చేసి సర్ది చెప్పిన అచ్చెన్నాయుడు .. రంగంలోకి చంద్రబాబు
బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు ఫోన్ చేసి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. రేపు విజయవాడలో చంద్రబాబు టూర్ సక్సెస్ అయ్యేలా చూడాలని అచ్చెన్నాయుడు నేతలను కోరారు . చంద్రబాబు టూర్ లో కేశినేని నాని పాల్గొంటే తాము పాల్గొనబోమని అచ్చెన్నాయుడుకు నేతలు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అచ్చెన్నాయుడు ఎన్నికల సమయంలో విభేదాలు వద్దని పార్టీ నేతలకు సర్ది చెప్పారు .
ఇదిలా ఉంటే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తెలుగు తమ్ముళ్లు విభేదాలతో రోడ్డున పడడంతో అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అసంతృప్త నేతలను సముదాయించిన అధినేత చంద్రబాబు
టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు అసంతృప్త నేతలను జరిగినట్లు సమాచారం. మరోపక్క వర్ల రామయ్య, అచ్చెన్నాయుడు, టిడి జనార్దన్ తదితరులు టిడిపి నేతలను సముదాయించారు. రేపు చంద్రబాబు పర్యటన విజయవాడలో జరగనున్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా బాబు టూర్ ను సక్సెస్ చేయాలని అసంతృప్త నేతలను కోరారు.
అంతా కలిసికట్టుగా పని చేసి విజయవాడలో టీడీపీ జెండా ఎగరెయ్యాలని , ఇలాంటి సమయంలో గొడవలు మంచిది కాదని సూచించారు .

రేపు చంద్రబాబు టూర్ లో అందరూ పాల్గొంటారా.. లేదా ? అనుమానమే
ఇంతకీ తెలుగు తమ్ముళ్ళు సైలెంట్ అయ్యారా? విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి విజయం కోసం పని చేస్తారా ? కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా అంగీకరిస్తారా ? రేపు చంద్రబాబు టూర్ ను సక్సెస్ చేస్తారా ? అనేది ప్రస్తుతం విజయవాడ రాజకీయాలను ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.