వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దడ పుట్టించారు: తల్లిని చూసి ఏడ్చిన రాధా, బెజవాడలో హైటెన్షన్..

సీపీ నేత గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలతో బెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. వంగవీటి రంగా, రాధాలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆదివారం పెద్ద హైడ్రామానే క్రియేట్ చేశాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vangaveeti Radha Gets Emotional, High Tension In Vijayawada | Oneindia Telugu

విజయవాడ: వైసీపీ నేత గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలతో బెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. వంగవీటి రంగా, రాధాలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆదివారం పెద్ద హైడ్రామానే క్రియేట్ చేశాయి. గౌతంరెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సిద్దపడగా.. పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు: వైసిపి నేత సంచలనం, జగన్ ఆగ్రహం, షోకాజ్వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు: వైసిపి నేత సంచలనం, జగన్ ఆగ్రహం, షోకాజ్

రాధాకృష్ణ, అతని తల్లి రత్నకుమారిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఆ క్రమంలో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు వ్యవహరించిన తీరుపై రాధా, రత్నకుమారిలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. వారు చెప్పేది వినకుండా.. పోలీసు వాహనంలో ఇద్దరిని తరలించారు. ఆపై సొంత పూచీకత్తుపై ఇద్దరు బయటకు రావడంతో వివాదానికి తాత్కాళికంగా తెరపడింది.

ప్రెస్ మీట్ అడ్డుకున్నారు:

ప్రెస్ మీట్ అడ్డుకున్నారు:

గౌతంరెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు వంగవీటి రాధాకృష్ణ తన అనుచరులతో కలిసి ఆదివారం ప్రెస్ మీట్ కు సిద్దమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ప్రెస్ మీట్ తర్వాత పరిణామాలు మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయన్న అనుమానంతో పోలీసులు రాధాకు అడ్డుపడ్డారు. ఇంతలో రత్నకుమారి కూడా అక్కడికి రావడం.. తోపులాటలో ఆమె కింద పడిపోవడం.. ఆమె పరిస్థితి చూసి రంగా కన్నీళ్లు పెట్టుకోవడం.. వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

నా తల్లిని పంపించండి, నేనొస్తా:

నా తల్లిని పంపించండి, నేనొస్తా:

పోలీసులతో వాగ్వాదం సందర్భంగా జరిగిన తోపులాటలో తల్లి రత్నకుమారి కిందపడిపోయారు. ఆమె స్పృహ కోల్పోవడంతో రాధా కన్నీటి పర్యంతమయ్యారు. 'నా తల్లిని ఆసుపత్రికి పంపించండి.. కావాలంటే నన్ను 10రోజులు కస్టడీలో ఉంచుకోండి.. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి' అంటూ రాధా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో చలించిన అభిమానులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు రాధా, రత్నకుమారిని అరెస్ట్‌ చేసి ఇబ్రహీంపట్నం తరలించారు.

ఎంజీ రోడ్డులో ప్రెస్ మీట్:

ఎంజీ రోడ్డులో ప్రెస్ మీట్:

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత.. రాధా తన ప్రెస్ మీట్ ఎంజీ రోడ్డులో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ముందస్తు సమాచారంతో పోలీసులు ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు.

కాసేపటికి విడుదల చేయడంతో.. ఎంజీరోడ్డులో ప్రెస్ మీట్ కోసం బయలుదేరారు. దీంతో పరిస్థితిని ముందుగానే ఊహించిన పోలీసులు మరోసారి ఆయన్ను అడ్డుకున్నారు. ప్రెస్ మీట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటానని రాధా హామి ఇచ్చినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు.

అభిమానుల ఆందోళన:

అభిమానుల ఆందోళన:

రాధా, రత్నకుమారిలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. స్టేషన్ ముందు బైఠాయించి గౌతంరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాధాను, రత్నకుమారిని వెంటనే విడుదల చేయాలని ఆరోపణలు చేశారు. రాధాను స్టేషన్ కు తరలిస్తున్న సమయంలోను వారంతా పోలీస్ వాహనాలను వెంబడించారు. దీంతో సుమారు రెండు, మూడు గంటల పాటు హైడ్రామా కొనసాగింది.

మంచినీళ్లు కూడా తాగమన్నారు:

మంచినీళ్లు కూడా తాగమన్నారు:

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత పోలీసుల తీరుపై రాధా, రత్నకుమారిలు నిరసన వ్యక్తం చేశారు. మంచినీళ్లు కూడా తాగేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. బయట అభిమానుల ఆందోళనతో పోలీసులు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసులు రాధా, రత్నకుమారిలను ప్రశ్నించారు.

ఆపై సొంత పూచీకత్తు మీద ఇద్దరిని విడిచిపెట్టడంతో అభిమానులు, అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. అప్పటికే గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడటంతో వారంతా ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

English summary
The police increased security at major junctions in the city after indiscriminate remarks made by a YSRC trade union leader against the late Kapu strong man Vangaveeti Mohana Ranga Rao and his brother Radhakrishna led to protests by the family and their subsequent arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X