అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కుల్లో చంద్రుడు: బీఆర్ శెట్టి హవాలా డీల్స్‌లో సాయం: నాడు ఏపీలో రెడ్ కార్పెట్...!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: భారత్‌లో ఆర్థిక నేరగాళ్ల జాబితా పెరిగిపోతూ ఉంది. లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు ఇలా చాలా మంందిని ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చేర్చింది. తాజాగా ఎన్ఎంసీ వ్యవస్థాపకులు బీఆర్ శెట్టి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకు 250 మిలియన్ డాలర్లు టోకర వేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే తన ఆస్తులను లేదా నగదును ఎవరికి అమ్మరాదని లేదా బదిలీ చేయరాదని కోర్టు శెట్టి దంపతులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు చుట్టుకుంది. బీఆర్ శెట్టికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయ్ సాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు.

సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు.. సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..

చంద్రబాబుకు బీఆర్ శెట్టితో సంబంధాలు

ఈ మధ్యకాలంలో టీడీపీని ప్రతి విషయంలోనూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తాజాగా ట్విటర్ వేదికగా చంద్రబాబుపై మరో ఘాటైన విమర్శలు చేశారు. ఎంఎన్‌సీ వ్యవస్థాపకుడు బీఆర్ శెట్టితో చంద్రబాబుకు సంబంధాలున్నాయనే విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు బ్యాంకులకు ఎవరు టోకరా వేసినా చంద్రబాబుకు వారితో సంబంధాలు ఉండటం చాలా కామన్‌ అయిపోయిందని ట్వీట్ చేశారు. ఇదేం యాధృచ్చికమం కాదని అన్నారు. బీఆర్ శెట్టి ఏకంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1800 కోట్లు ఎగవేశాడని చెప్పిన విజయసాయిరెడ్డి అమరావతిలో వేలకోట్లతో హెల్త్ సిటీ పెడతారని అప్పట్లో చంద్రబాబు శెట్టిని వెనకేసుకుని తిప్పారని గుర్తుచేశారు విజయసాయిరెడ్డి. హవాలా డీల్స్‌లో శెట్టికి బాబు సాయం చేస్తుంటారనే ఘాటైన విమర్శలు విజయసాయి చేశారు.

 హెల్త్ సెక్టార్‌లో పెట్టుబడులంటూ ఎంఓయూ

హెల్త్ సెక్టార్‌లో పెట్టుబడులంటూ ఎంఓయూ

2016 నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును బీఆర్ శెట్టి దంపతులు కలవడం జరిగింది. హెల్త్ కేర్ రంగంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో రూ.12వేల కోట్లు పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చారు బీఆర్ శెట్టి. ఇందులో భాగంగా ఒక హెల్త్ యూనివర్శిటీ, టూరిజం, హాస్పిటాలిలీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వీటికి సంబంధించి ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ఇక దీనికి తోడు 10వేల సీటింగ్ కెపాసిటీతో ఒక కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని అది భారత దేశంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని నాడు చెప్పడం జరిగింది. 3500 బెడ్లు ఉన్న వరల్డ్ క్లాస్ హాస్పిటల్ నిర్మాణం, ఇందులో 1500 బెడ్లు ఉన్న హాస్పిటల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడం, కర్నూలులో 300 పడకల హాస్పిటల్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక అమరావతిని ప్రపంచంలోనే అగ్రరాజధానిగా తీర్చి దిద్దే క్రమంలో 18 గోల్ఫో కోర్సులను కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. ఇక వీటన్నిటి కోసం బీఆర్ శెట్టికి రాజధాని ప్రాంతంలో భూమి కూడా కేటాయించింది అప్పటి చంద్రబాబు సర్కార్. బీఆర్ఎస్ వెంచర్స్ ఛైర్మెన్ బీఆర్ శెట్టిని కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.

Recommended Video

Kishan Reddy Opposes KCR Comments On Central Govt Financial Package
 కోర్టు ఏం చెప్పిందంటే..

కోర్టు ఏం చెప్పిందంటే..

ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.1800 కోట్లు రుణం తీసుకున్న బీఆర్ శెట్టి గ్యారెంటీ కింద దేశంలోని ప్రధాన నగరాల్లో తనకున్న ఆస్తులను పెట్టాడు. అయితే ఈ ఆస్తులను ఇతరులకు బదిలీ చేయడం లేదా అమ్మడం కానీ చేయరాదని బెంగళూరు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంటూ కేసును జూన్ 8కి వాయిదా వేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లో ఆరోగ్య రంగంలో ఎన్‌ఎంసీ సంస్థ అతిపెద్ద హెల్త్ కేర్ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందింది. అయితే కొన్ని నెలలుగా సంస్థ నష్టాలు బాట పట్టడం, స్థిరత్వం కోల్పోయింది. మార్చిలో సంస్థకు 6.6 బిలియన్ డాలర్లు మేరా అప్పులున్నాయని ప్రకటించింది. అంతకుముందు అది 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నింది.

English summary
BR Shetty who is a defaulter has moved closely with AP former CM Chandrababu alleged YSRCP MP Vijayasai Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X