• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అర్ధరాత్రి మద్యం మత్తులో వాలంటీర్ వీరంగం: చొక్కా చించుకుని మహిళా ఎస్ఐపైకి..

|

నెల్లూరు: ఆత్మకూరులో ఓ గ్రామ వాలంటీర్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో స్థానిక 21వ వార్డుకు చెందిన వాలంటీర్, అతని స్నేహితుడిపై కేసు నమోదు చేశారు.

సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాలంటీర్, మరో మహిళా వాలంటీర్ భర్త మద్యం తాగి వెళుతున్నారు. అదే సమయంలో ఎస్ఐ రోజాలత వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

village volunteer misbehaving with lady si in atmakur

వాలంటీర్ వాహనాన్ని ఆపిన ఎస్ఐ.. ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అంతేగాక, ఎస్ఐని దుర్భాషలాడారు. మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా తిట్ల పురాణం అందుకున్నారు. ఎస్ఐపైకి దూసుకొస్తూ.. చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు.

అంతేగాక, అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఐ నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే, ఆ మరుసటి రోజే ఆ సీఐని బదిలీపై పంపించడం చర్చనీయాంశంగా మారింది.

English summary
village volunteer misbehaving with lady si in atmakur in nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X