వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోగాపురం విమానాశ్రయం: సర్వే బృందాలపై భగ్గుమన్న భోగాపురం

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అవసరమైన భూములను సర్వే చేసేందుకు వచ్చిన రైట్స్ సంస్థకు చెందిన సర్వే బృందాలను గూడెపువలస రైతులు, ప్రజలు మంగళవారం అడ్డుకున్నారు. నలుగురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిగా గ్రామంలో పరిస్థితులను పరిశీలిస్తూ తిరుగుతున్న స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బందిని అడ్డుకుని పంచాయతీ కార్యాలయ గదిలో గ్రామస్థులు గంటకుపైగా నిర్బంధించారు.

దాంతో పోలీసులు తమ అదుపులో ఉన్న రైతులను వదలిపెట్టడంతో గ్రామస్థులు కూడా పోలీసు సిబ్బందిని వదలిపెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య వ్యవహారం నడిచింది. భూముల విషయంలో ఇప్పటి వరకు సరిహద్దులను గుర్తించటంలో తలమునకలుగా ఉన్న అధికారులు, రైట్స్ సర్వే బృందాలు తాజాగా రైతుల భూమలలో సర్వే ప్రారంభించాయి.

గూడెపువలస గ్రామం వద్ద రైతుల భూములలో సర్వే పనులను రైట్స్ సంస్థకు చెందిన ఐదు బృందాలు ప్రారంభించాయి. రైతులు అక్కడకు చేరుకుని తమ భూములలో సర్వే జరపటాన్ని వ్యతిరేకిస్తూ సర్వే బృందాలను, వారి వెంట ఉన్న భోగాపురం తహశీల్దార్‌ను, పోలీసు సిఐని అడ్డుకున్నారు. రైతులు చాలామంది చేరుకోవటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మండల అధికారులు.

Villagers oppose land acquisition for Bhogapuram airport

జిల్లా అధికారులకు పరిస్థితి వివరించటంతో జిల్లాకేంద్రం నుంచి డిఎస్పీ ఆధ్వర్యంలో భారీఎత్తున పోలీసు బలగాలు గూడెపువలస గ్రామానికి చేరుకున్నాయి. రైతులకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేందుకు పోలీసు ప్రయత్నించినా ఫలితం నలుగురు రైతులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి భోగాపురం తరలించారు. సర్వే అనంతరం రైట్స్ బృందాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

ఇదే సమయంలో గ్రామప్రజలు పోలీసుశాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బందిని అడ్డుకుని ఒక గదిలో నిర్బంధించారు. పోలీసుల అదుపులో ఉన్న రైతులను విడుదల చేస్తేనే తమ ఆధీనంలోని పోలీసు సిబ్బందిని విడుదల చేస్తామని పట్టుబట్టారు.

పరిస్థితి విషమిస్తుందనే అభిప్రాయంతో సుమారు సుమారు గంట అనంతరం పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న గూడెపువలసకు చెందిన నలుగురు వ్యక్తులను వదిలిపెట్టారు. ఇది తెలసి గదిలో నిర్బంధించిన స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సిబ్బందిని గ్రామస్థులు వదిలేసారు. దాంతో ఉద్రిక్తతకు తాత్కాలికంగా తెరపడింది.

English summary
Gudepu valasa villagers obstructed survey teams, came to verify the lands for Bhogapuram airport in Vijayanagaram district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X