• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Viral Video: 60వ బర్త్ డే.. ఆరవై వంటకాలు, అత్తకు కోడలు గిప్ట్: ఎక్కడ అంటే!

|

సాధారణంగా అత్త, కోడళ్లకు పడదు. ఏదో విషయానికి గొడవలు.. అభిప్రాయ భేదాలు సహజమే. మేనరికం చేసుకున్న తప్పదు. కానీ 100లో ఒకరు మాత్రం బాగుంటారు. అదీ చాలా అరుదు.. అత్తలు కోడళ్లకు, కోడళ్లకు అత్తలు గిప్ట్ ఇవ్వడం కూడా అసాధారణమే. ఏ సినిమాలోనో.. సిరియళ్లోనో.. మాత్రం జరుగుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గల పశ్చిమ గోదావరిలో మాత్రం ఓ కోడలు.. కోడలా.. ? కూతురా అనేలా చేశారు. అత్త బర్త్ డే సందర్భంగా వివిధ వంటకాలు చేసి ఔరా అనిపించారు.

గౌరవం.. మర్యాద..

గౌరవం.. మర్యాద..

ఏపీలో గౌరవ మర్యాదలు కాస్త ఎక్కువే.. ఇక ఉభయ గోదావరి జిల్లాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోదావరి జిల్లాలు అంటేనే గౌరవం, మర్యాద.. అంటారు. ఇటీవల ఓ తండ్రి కూతురు ఇంటికి ఆషాడం సారె పంపించి అబ్బురపరిచారు. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కోడలు అలాంటి మంచి పనిచేసింది. నలుగురికి ఆదర్శంగా నిలిచారు. తన అత్త 60వ పుట్టినరోజు కలకలం గుర్తుండేలా చేశారు. పుట్టినరోజు అంటే ఏదో దద్దొజనం.. లేదంటే బిర్యానీ చేసి చేతులు దులుపుకోలేదు. ఒకటి కాదు రెండు కాదు 60 రకాల వంటకాలు చేసిపెట్టింది.

60 వంటకాలు

60 వంటకాలు

ఒకటి రెండు వంటకాలు చేయడం మహాకష్టం. అదీ కూడా అత్తకు చేయడం అంతా వీజీ కాదు. కానీ ఆమె 60 వంటకాలు చేసింది. అవున పులిహోర, బిర్యానీ, కర్డ్ రైస్, చల్లట్లు, అలు పరోటా, కొత్తిమీర చపాతీ, టొమాటో రైస్, సేమియా ఉప్మా, గారెలు, బంగాళదుంప బొండలు, ఇడ్లీ, అరటికాయ బజ్జీ, చల్ల పంగడలు, బ్రెడ్ శాండ్ విచ్ అలా 60 వంటకాలు చేశారు. ఆమె చేసిన వంటకాలు చూసి.. నోరూ ఊరుతుంది. స్వీట్, హాట్ కలిపి.. అత్తపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

అదృష్టవంతురాలు అత్త

ఆ అత్త నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే తన పుట్టినరోజు సందర్భంగా కోడలు ఇచ్చిన బహుమతి మాములు కాదు. తినుబండారాలతో చేసి పెట్టిన ఐటెమ్స్ ప్రతీ ఒక్కరు మరవలేరు. లక్షలు, కోట్ల రూపాయల కన్నా కూడా ప్రత్యేకం. ఇష్టపడి చేసిన ఫుడ్ ఐటెమ్స్ ప్రతీ ఒక్కరీ మదిని దోస్తుంది. అవీ చేయడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు.. కానీ అత్తపై తనకు ఉన్న మమకారాన్ని మాత్రం చాటుకున్నారు.

కోడలు అంటే ఇలా ఉండాలి

కోడలు అంటే ఇలా ఉండాలి.. అత్త అంటే అలా మెలగాలి అని అందరూ అంటున్నారు. వీడియో పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్ అయ్యింది. వావ్ అత్త కోడళ్లు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీరిద్దరూ మిగతావారికి ఆదర్శంగా నిలిచారని కామెంట్ చేస్తున్నారు. నిజానికి వీరిద్దరీ స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రతీ ఒక్కరికీ వస్తే ఆ సమాజమే వసుదైక కుటుంబం అవుతుంది అనడంలో సందేహం లేదు.

English summary
daughter in law special gift to her mother in law 60th birthday. she prepares 60 variety food items. incident happen at west godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X