వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: ఈ నేతను గుర్తుపట్టారా? -ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా మోపెడ్‌పై..

|
Google Oneindia TeluguNews

పదవిలో ఉన్నా, లేకున్నా బిల్డప్‌కు మాత్రం ఢోకా ఉండొద్దనుకుంటారు చాలా మంది రాజకీయ నేతలు. పవర్ అనుభవించకుండానే ఆర్భాటాలకు పోయి ఆస్తుల్ని తెగనమ్ముకున్న నేతలు కూడా మనకు తెలుసు. అయితే, ఈ ఫొటోలోని నాయకుడు మాత్రం కాస్త డిఫరెంట్. సంపదలోనే పుట్టి, ఏకంగా పదేళ్ల పాటు మంత్రిగిరి చేసి, అన్ని ప్రాంతాల్లో తనకంటూ అనుచరులను కలిగుండి, సొంత పిల్లలంతా విదేశాల్లో సెటిలై.. చెప్పుకోడానికి చాలా ఉన్నప్పటికీ అతి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తుంటారు..

Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

ఈ నేతను గుర్తు పట్టారా?

ఈ నేతను గుర్తు పట్టారా?

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది గంటలుగా ఓ ఫొటో, వీడియో క్లిప్ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలోని నాయకుడిని గుర్తు పట్టారా? అంటూ చర్చలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన ఆయన.. అనంతపురం జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఏడాది ముందు వరకు కూడా ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుచరులు ఉన్నవారు. కానీ, ఆదివారం అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనెవరో కాదు, ఎన్.రఘువీరారెడ్డి!

వరుస దెబ్బలతో కనుమరుగు..

వరుస దెబ్బలతో కనుమరుగు..

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభంజనం ద్వారా 2004లో మంత్రి అయిన రఘువీరా రెడ్డి.. వైఎస్ మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్ లోనూ కొనసాగుతూ 2014 వరకు ఏకధాటిగా మంత్రిగా పనిచేశారు. రాష్ట్రాల పునర్విభజన తర్వాత, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సారధ్య బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు రఘువీరా ఏపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సున్నాకు పరిమితమైపోవడం, ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయిన తర్వాత దాదాపు రాజకీయ చిత్రపటం నుంచి కనుమరుగైన రఘువీరా.. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కనిపించేవారు. కాగా,

నిమ్మగడ్డ వల్ల జగన్‌‌‌కు నష్టమెంతో తెలుసా? -చతికిలపడ్డా చుక్కల్లో అంకెలా? -ఏపీలోనూ 'మిషన్ భగీరథ'నిమ్మగడ్డ వల్ల జగన్‌‌‌కు నష్టమెంతో తెలుసా? -చతికిలపడ్డా చుక్కల్లో అంకెలా? -ఏపీలోనూ 'మిషన్ భగీరథ'

పాత మోపెడ్‌పై భార్యతో ఇలా..

ఏపీలో చివరిదైన నాలుగో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగ్గా, అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలోని పోలింగ్ బూత్‌కు.. ఓ పాత మోపెడ్ వాహనంపై తన భార్య సునీతను ఎక్కించుకుని రఘువీరా విచ్చేశారు. పూర్తిగా నెరిసిన గడ్డం, పక్కా రాయలసీమ స్టయిల్లో పంచెకట్టు, తెల్ల చొక్కా, పైన తువాలుతో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా రఘువీరా మారిపోయారు. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన రఘువీరానేనా ఈయన అనుకునేలా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లో కార్లు ఉన్నా, వాటిని కాదనుకుని పాత వాహనంపై జనంలో తిరుగుతోన్న రఘువీరా సింప్లిసిటీని నెటిజన్లు అభినందిస్తున్నారు.

English summary
Remember the leader in this photo? Looks sharp and feels like you saw it somewhere. photos and videos of Former Minister, APCC Ex-President N Raghuveera Reddy gone viral after he appear like a normal person on sunday amid panchayat elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X