వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయ్యా నీ ధైర్యానికి సలాం: ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన సామాన్యుడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన సామాన్యుడు

గుంటూరులో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. సామాన్యుడిని బెదిరించి మరీ బండి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. బండిని ఎందుకు తీసుకెళుతున్నారు... ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆ సామాన్యుడు ట్రాఫిక్ పోలీసులను ధైర్యంగా ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పోలీసులపై ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో ప్రశ్నించిన సామాన్యుడికి జేజేలు పలుకుతున్నారు.

గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ చాలా మంది తమ బైకులను పార్కు చేశారు. అదేసమయంలో అటుగా వచ్చిన ట్రాఫిక్ పోలీసులు బైకులు పార్క్ చేసి ఆ ఓనర్లు అక్కడే ఉంటే వారికి చలానా రాస్తున్నారు. అక్కడ బైకు ఉండి ఓనర్లు లేకుంటే అలాంటి బైకులను ట్రక్కులోకి ఎక్కిచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆ పోలీసులకు అసలైన సామాన్యుడు తగిలాడు. తన బైకును కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఈ బైకును ఎలా తీసుకెళతారు...ఇక్కడ ఏమైనా నోపార్కింగ్ బోర్డు పెట్టారా...? మరి పెట్టనప్పుడు ఎలా తీసుకెళతారు... చలానా రాయాలంటే ఎస్సై ఉండాలి... ఎస్సై ఎక్కడ అన్న ప్రశ్నకు బిక్కమొహం వేయడం ట్రాఫిక్ పోలీసుల వంతైంది. అయినా వారు వదల్లేదు. ఏదైనా ఉంటే ఫైన్ కట్టి బండిని తీసుకెళ్లు అని చెప్పడంతో.. ఆ సామాన్యుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందుగా నిబంధనలు తెలుసుకోండి. ఎస్సై లేకుండా చలానా రాసే అధికారం మీకెవరిచ్చారు. నోపార్కింగ్ బోర్డు లేదు.. మరి చలానా ఎలా రాస్తారు...అంటూ పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగించారు.

సామాన్యుడి ప్రశ్నల వర్షం తట్టుకోలేక అందరూ జరిమానా కడుతున్నప్పుడు నీకేంటి ప్రత్యేకం అని ప్రశ్నించగా... వెంటనే ఆ సామాన్యుడు ఇక్కడ నో పార్కింగ్ ఉన్న సంగతి మీకు తెలుసా అని అడిగాడు. దీంతో చుట్టు పక్కల వారు తెలీదు అని చెప్పగానే మరి జరిమానా కట్టొద్దంటూ వారిని వారించాడు . ఈ గొడవ అంతా తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన సదరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పట్టించుకోలేదు. ఏదైనా ఉంటే స్టేషన్‌కు వచ్చి మాట్లాడండి అంటూ రొటీన్ డైలాగులు కొట్టారు. అంతేకాదు ఈ యువకుడు ప్రశ్నిస్తున్న తీరును అదేదో తప్పైనట్లు మరో కానిస్టేబుల్ వీడియో తీశాడు.

Viral video: How can you put fine in the absence of SI,questions common man

ఇంతా జరుగుతున్న చుట్టు పక్కల వారు ఆ సామాన్యుడికి అండగా నిలిచేందుకు ముందుకురాలేదు. దీనిపై నెటిజెన్లు ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను పోరాడేది అందరికోసమే కదా... ఎందుకు ఆయనకు సహకరించరు అని ప్రశ్నలు గుప్పించారు. మొత్తానికి సామాన్యుడు సంధించిన ప్రశ్నలకు ట్రాఫిక్ పోలీసులు అల్లాడిపోయారు. అయితే ట్రాఫిక్ ఎస్సై లేకుండా చలాన్లు ఎలా రాస్తారు...? నోపార్కింగ్ బోర్డు పెట్టకుండా ఫైన్లు ఎలా వేస్తారో అది ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి.

English summary
A common man questioning the traffic police video has gone viral on social media. The Guntur traffic police were on their duty seizing the bikes that were parked in front of a commercial complex.The common man dared and asked the police as why he was fined when there was no "No parking"board set up. He also questioned the cops as how the challans were written in the absence of SI at that location.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X