Viral Video: 387 కి.మీ నాన్‌స్టాప్‌గా డ్రైవ్.. పేలిన బుల్లెట్ బండి.. ఎక్కడ అంటే
బుల్లెట్ బండి సాంగ్ తర్వాత.. రాయల్ ఎన్ఫీల్డ్ క్రేజీ మాములుగా లేదు. యువతే కాదు.. 30, 40 ఏళ్ల వయస్సు వారు కూడా ఆ బండి అంటే ఇష్టపడతారు. అయితే కంటిన్యూగా బైక్ నడపడం ఇబ్బందే.. అదీ వందలకొద్దీ కిలోమీటర్లు డ్రైవ్ చేయడం అనర్థమే.. అయితే పెద్ద ఇంజిన్ కావడంతో.. ఏం కాదు అనుకుంటాం.. అలానే మైసూరుకు చెందిన రవిచంద్ర కూడా అనుకున్నాడు. కానీ ఆ బైక్ మాత్రం మంటలొచ్చి.. పేలిపోయింది.

లాంగ్ డ్రైవ్.. 387 కి.మీ
లాంగ్ డ్రైవ్ అంటే అందరికీ ఇష్టమే. అయితే కొత్త బైక్ కొనుగోలు చేసిన సందర్భంలో పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. అదీ వందల కిలోమీటర్లు అయితే ఇబ్బందే.. మైసూరుకు చెందిన రవిచంద్ర కొత్త బుల్లెట్ బండి కొనుగోలు చేశాడు. పూజ చేయించాల్సి ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో గల అనంతపురం జిల్లాకు బయల్దేరాడు.
అయినా చేసిన తప్పేమిటంటే.. ఆ 387 కిలోమీటర్లు బండి నాన్ స్టాప్‌గా నడపడమే.. అవును.. అలా నడిపి గుంతకల్లులో గల నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం లోపలికి వెళ్లాడు. ఇంకేముంది బైక్ మంటలు చెలరేగాయి. తర్వాత పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. వెంటనే అక్కడున్న వారు నీరు పోసి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం లేదు.
వైరల్..
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. బైక్ నుంచి ఎందుకు మంటలు వచ్చాయో ఇప్పటివరకు తెలియలేదు. కానీ కొత్త బండి మాత్రం దగ్దం అయ్యింది. దీనిపై కంపెనీ స్పందించలేదు. ఇన్సూరెన్స్ వర్తిస్తోందో లేదో చూడాలీ మరీ. ఇదిలా ఉంటే మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఫ్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్ కూడా పేలింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. మంజంపక్కమ్లో గల మథూర్ టోల్ ప్లాజా వద్ద ఘటన జరిగింది.

మరో రెండు ఘటనలు
మరోవైపు మార్చి 28వ తేదీన పుణెలో కూడా ఒక ఎలక్ట్రిక్ వాహనం పేలిపోయింది. రోడ్డుమీద వాహనం పార్క్ చేయగా.. ఈ ఘటన జరిగింది. తమిళనాడు వెల్లూరులో ఒకినావా లక్ట్రిక్ వెహికల్ కూడా పేలిపోయింది. ఇప్పుడు బుల్లెట్ బండి పేలింది. వాస్తవానికి ఇదీ.. పెద్ద ఇంజిన్. ఇంతకుముందు ఇలాంటి ఘనట జరగలేదు. దీనిపై కంపెనీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. 400 సీసీ ఇంజిన్ వాహనం పేలడంపై నెటిజన్లు, యువత ఆశ్చర్య పోతున్నారు.