• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

|

ఇటీవలే 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొన్న 'ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' పార్టీ.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ పై పట్టుకోసం ప్రయత్నాలు ఆరంభించింది. ఏపీలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్ ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ క్రమంలో సహజంగానే బీజేపీతోపాటు అధికార వైసీపీనీ మజ్లిస్ టార్గెట్ చేసింది. సంచలనాలకు కేంద్రంగా ఉండే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ కీలక నేతలపై తీవ్ర కామెంట్లు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు..

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులుజగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

ఓవైసీ గ్రాండ్ ఎంట్రీ

ఓవైసీ గ్రాండ్ ఎంట్రీ

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కొనసాగుతుందని ఎంఐఎం పార్టీ ప్రకటించుకుంది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఏపీ జనం బ్రహ్మరథం పడుతున్నారంటూ విడుదలైన ఓ వీడియో వైరల్ గా మారింది. శనివారం కర్నూలు జిల్లా ఆదోనీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓవైసీ.. కిక్కిరిసిన జనం మధ్యలో నుంచి వెళుతోన్న వీడియోను అసద్ రీ ట్వీట్ చేశారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో అదోని మున్సిపాలిటీలో 4 వార్డుల్ని గెలుచుకున్న మజ్లిస్.. 2021 మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని స్థానాలపై కన్నేసింది...

నాలుగు జిల్లాల్లో ఎంఐఎం పోటీ..

నాలుగు జిల్లాల్లో ఎంఐఎం పోటీ..

2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 34 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం బరిలోకి దిగింది. అదే ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదోనిలో 4 వార్డులు గెలుచుకోగా, ఇప్పుడు ఏకంగా నాలుగు జిల్లాల్లో పోటీకి దిగుతోంది. కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణాజిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యూహాత్మకంగా 47 వార్డుల్లో మాత్రమే ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టింది. కాగా, ఆయా స్థానాల్లో హిందువులను సైతం మజ్లిస్ అబ్యర్థులుగా నిలిపింది. ఎంపీఎం పోటీచేస్తోన్న స్థానాల్లో ఆదోని, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, నందికొట్కూరు, గుంతకల్, కదిరి, రాయదుర్గం, హిందూపూర్ తోపాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉన్నాయి. పలు పట్టణాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తోన్న ఓవైసీ.. బీజేపీ, వైసీపీని కలిపి టార్గెట్ చేస్తున్నారు..

గతంలో వైసీపీకి బేషరతు మద్దతు

గతంలో వైసీపీకి బేషరతు మద్దతు

విభజన తర్వాత ఏపీకి సంబంధించి గతంలో జరిగిన ఎన్నికల్లో జగన్ కు మద్దతివ్వాలని, వైసీపీకి ఓట్లేయాలని ఎంఐఎం కార్యకర్తలు, నేతలకు బహిరంగంగా చెప్పామని అధినేత ఓవైసీ గుర్తుచేశారు. అయితే ఈసారి మాత్రం వైసీపీకి ఓటేయొద్దని, ఎంఎంఐం అభ్యర్థులకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఏపీకి సంబంధించిన కీలక సమస్యలపై మజ్లిస్ పోరాడుతుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, జగన్ ప్రభుత్వ భూముల్ని అమ్మడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని ఓవైసీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్, బీజేపీలపై ఆయన మరికొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులుజగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

జగన్ సీటుకు ఎసరు..

జగన్ సీటుకు ఎసరు..

ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని, ఈ విషయం పట్టనట్లుగా సీఎం జగన్ కళ్లు మూసుకుని ఉంటే ఆయన సీటుకే ఎసరు వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలని, మతోన్మాదులను ఉక్కుపాదంతో అణిచేయాలని అన్నారు. ఎంఐఎం పట్ల జగన్ వైఖరి సవ్యంగా లేదన్న ఆయన.. రాబోయే రోజుల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతామన్నారు. వైసీపీని రెడ్ల పార్టీగా, టీడీపీని కమ్మ పార్టీగా ఓవైసీ అభివర్ణించారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడులు వెనుక ఉన్నది హిందుత్వవాదులేనని ఒవైసీ ఆరోపించారు. కరోనా వ్యాప్తి సహా ప్రతి విషయంలో ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా,

సాయిరెడ్డి బేకార్.. చంద్రబాబుకు అలా..

కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఓవైసీ.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి సంచలనం వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పర్యటనలకు సహకరిస్తోన్న వైసీపీ సర్కారు.. ఎంఐఎం విషయానికి వచ్చేసరికి భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పెద్ద బేకార్‌గాడు. ఇలాంటి బేకార్ వ్యక్తికి జగన్ మంత్రి పదవి ఇస్తాడట. జిల్లాలో నా పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం చక్కగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మైనార్టీల ఓట్లతో గెలిచి, ఇవాళ మమ్మల్నే అడ్డుకుంటారా? నన్ను రానీయకుండా ఆపడం జగన్ వల్లో మరొకరి వల్లో కానేకాదు'' అని ఓవైసీ అన్నారు.

English summary
Alleging that Hindutva forces are behind the attacks on temples in Andhra Pradesh, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) president and Hyderabad MP Asaduddin Owaisi warned Chief Minister YS Jagan Mohan Reddy that ysrcp chief could face consequences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X