• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: సర్జరీ తర్వాత స్టైల్ మార్చిన ఎమ్మెల్యే రోజా -చెన్నై నుంచే నగరికి ఆదేశాలు -ఇలాగైతే మార్పు కష్టం

|

ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా ప్రస్తుతం పనితీరులో కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు. సాధారణంగా ఎలాంటి కార్యక్రమంలోనైనా జనంతో నేరుగా మమేకమయ్యే ఆమె ప్రస్తుత కొవిడ్ పరిస్థితులు, ఆరోగ్య కారణాల వల్ల వర్కింగ్ ఫ్రమ్ హోమ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇటీవలే రెండు శస్త్ర చికిత్సలు జరగ్గా, చెన్నైలోని సొంతింట్లోనే కోటుకుంటోన్న ఆమె వరుస వీడియో కాన్ఫరెన్సుల ద్వారా సొంత నియోజకవర్గం నగరిలోని అధికారులు, నేతలకు కీలక ఆదేశాలిస్తున్నారు..

అసైన్డ్ భూములపై జగన్ సంచలనం -వ్యవసాయ భూమికంటే 10శాతం ఎక్కువ పరిహారం -దేశంలో తొలిసారి ఏపీలోనేఅసైన్డ్ భూములపై జగన్ సంచలనం -వ్యవసాయ భూమికంటే 10శాతం ఎక్కువ పరిహారం -దేశంలో తొలిసారి ఏపీలోనే

ప్రజా చైతన్యంతోనే కరోనాకు చెక్

ప్రజా చైతన్యంతోనే కరోనాకు చెక్

కొవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని నియమ నిబందనలు పెట్టినప్పటికీ, ప్రజల్లో చైతన్యం వస్తేనే వైరస్ వ్యాప్తి కట్టడి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చెన్నైలోని ఇంటి నుంచి తన నియోజకవర్గం నగరి పరిధిలో కొవిడ్ పరిస్థితులను ఆమె సమీక్షించారు. అధికారులు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. నగరి, పుంగనూరుల్లో కరోనా టెస్టులు, కోవిడ్ ఆసుపత్రి, కరోన పెషంట్లకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్ వ్యాక్సిన్లపై సంచలన మలుపు -పేటెంట్ హక్కుల రద్దుకు అమెరికా ఓకే -భారత్‌కు బైడెన్ మద్దతు, లేదా విలయమే కొవిడ్ వ్యాక్సిన్లపై సంచలన మలుపు -పేటెంట్ హక్కుల రద్దుకు అమెరికా ఓకే -భారత్‌కు బైడెన్ మద్దతు, లేదా విలయమే

ప్రాణాలను పణంగా పెట్టి సేవలు..

ప్రాణాలను పణంగా పెట్టి సేవలు..

కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ప్రధానమైనదని, ప్రభుత్వ నిబంధనల కంటే జనంలో మార్పుతోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమని రోజా అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలూ ప్రజాసేవ చేస్తున్నారని, వైద్య సిబ్బంది కష్టం చూశాకైనా జనం కనీసం బయట తిరగకుండా, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

రాబోయే విలయంపై సర్కారు దృష్టి

రాబోయే విలయంపై సర్కారు దృష్టి


ప్రస్తుత సెకండ్ వేవ్ లో కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, సొంత వాళ్లను పోగొట్టుకోవడం ఎవరికైనా బాధాకరమే అని, అయితే రాబోయే రోజుల్లో వైరస్ ఉధృతి కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం దృష్టిసారించిందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. కరోనా లక్షణాలుంటే డాక్టర్ల సూచనలతో హోం ఐసోలేషన్ లేదా క్వారంటైన్ సెంటర్లలో ఉండాలేతప్ప నాటు వైద్యాల జోలికి పోరాదని ఆమె సూచించారు. సమిష్టి సహకారంతోనే వైరస్ ను ఎదుర్కొనగలమన్నారు. నగరి మునిసిపాలిటీ అర్బన్ హోసింగ్ అధికారి సుబ్రమణ్యం మరణంపై ఎమ్మెల్యే రోజా సంతాపం తెలిపారు.

English summary
YSRCP MLA RK Roja, who is now at chennai home, recovering after two major surgeries, is currently working from home. roja spoke to nagari officials and leaders via online and video conferencing amid covid surge. videos of mla roja went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X