వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఛానెళ్లపై నిషేధం ఎత్తేయాలి: విరసం నేతలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలివేతకు సోమవారానికి వంద రోజులు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని సుందరయ్య కళా నిలయంలో విరసం నేతలు మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై సదస్సు నిర్వహించారు.

రెండు ఛానళ్లను నిలిపివేసి సోమవారం నాటికి వంద రోజులు అయిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందంచలేదని, టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, ఏబీఎన్‌ నిలిపివేతకు ఇప్పటివరకు ఒక్క కారణం కూడా చెప్పలేదని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.

రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కేంద్రం చెప్పినా ఎంఎస్‌ఓలు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. తమ చేతిలో ఏమీ లేదని టీ ప్రభుత్వం చెబుతోందని... జర్నలిస్టుల నిరసనలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

విరసం నేతలు

విరసం నేతలు

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలివేతకు సోమవారానికి వంద రోజులు పూర్తి అయ్యాయి.

విరసం నేతలు

విరసం నేతలు

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని సుందరయ్య కళా నిలయంలో మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. మీడియా ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

విరసం నేతలు

విరసం నేతలు

రెండు ఛానళ్లను నిలిపివేసి సోమవారం నాటికి వంద రోజులు అయిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందంచలేదని, టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, ఏబీఎన్‌ నిలిపివేతకు ఇప్పటివరకు ఒక్క కారణం కూడా చెప్పలేదని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.

విరసం నేతలు

విరసం నేతలు

రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కేంద్రం చెప్పినా ఎంఎస్‌ఓలు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు.

English summary
Virasam leaders on Monday fired at Telangana Government for ban on TV9 and ABN Andhra Jyothi news channels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X