వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ సెంటిమెంట్: భారత ఆటగాళ్ల సందడి, అభిమానుల ఉత్సాహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చాలాకాలం తర్వాత విశాఖ వేదికగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగడంతో స్టేడియం ప్రాంతాలు ఆదివారం క్రీడాభిమానులతో వెల్లువలా పొంగాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచే వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుని తమదైన వేషధారణలతో రోడ్లపై సందడి చేస్తూ కనిపించారు.

తమ అభిమాన ఆటగాళ్లను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఉత్సాహంగా గడిపారు. దేశాభిమానం వెల్లువెత్తేలా ముఖం, ఒంటిపై పలుచోట్ల టాటూలు వేయించుకోవడంతో పాటు టోపీలు, జాతీయజెండాలు, టీషర్టులు ధరించి ‘ఐ లవ్‌ ఇండియా' అంటూ అటూ ఇటూ తిరుగుతూ అభిమానం ప్రదర్శించారు.

కాగా, ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోను భారత్ విజయం సాధిస్తూ వచ్చింది. ఇదే స్టేడియంలో ఆదివారం జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం ద్వారా తన విజయాల పరంపరను కొనసాగించింది. ఇప్పటికే 1-1తో సిరీస్ సమం చేసిన భారత్, చివరి మ్యాచ్‌లో విజయం ద్వారా సిరీస్‌తో పాటు ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

చాలాకాలం తర్వాత విశాఖ వేదికగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగడంతో స్టేడియం ప్రాంతాలు ఆదివారం క్రీడాభిమానులతో వెల్లువలా పొంగాయి.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

మధ్యాహ్నం మూడు గంటల నుంచే వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుని తమదైన వేషధారణలతో రోడ్లపై సందడి చేస్తూ కనిపించారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

తమ అభిమాన ఆటగాళ్లను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఉత్సాహంగా గడిపారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

దేశాభిమానం వెల్లువెత్తేలా ముఖం, ఒంటిపై పలుచోట్ల టాటూలు వేయించుకోవడంతో పాటు టోపీలు, జాతీయజెండాలు, టీషర్టులు ధరించి ‘ఐ లవ్‌ ఇండియా' అంటూ అటూ ఇటూ తిరుగుతూ అభిమానం ప్రదర్శించారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

సాయంత్రం 5 గంటల నుంచి స్టేడియం లోనికి ప్రేక్షకులను అనుమతించారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

క్రికెటర్లు స్టేడియం లోనికి వచ్చే సమయంలో ప్రధాన ద్వారం వద్ద అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.

లంక అభిమానులు

లంక అభిమానులు

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు.. తర్వాత టికెట్లు లేని అభిమానులు వందలాది మంది స్టేడియం బయట వేచి ఉన్నారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

ప్రేక్షకులు టిక్కెట్లపై సూచించిన నెంబర్ల ప్రకారం ఆయా గేట్లకు చేరుకునేందుకు నానా పాట్లు పడ్డారు. స్టేడియం ముందు, వెనుక ప్రాంతాలైన రత్నగిరికాలనీ, సుందర్‌నగర్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ వాహనాల పార్కింగ్‌తో నిండిపోయాయి.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

పోలీసులు పెట్టిన ఆంక్షలతో స్టేడియం పరిసరాల్లో ఉండే నివాసితులు ఆదివారం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

గేట్ల నెంబర్లు, వివరాలు తెలిపేలా ప్రచార బోర్డులు చాలా తక్కువగా ఏర్పాటు చేయడంతో ప్రేక్షకులు ఇబ్బందులు పడ్డారు. మధురవాడకు వచ్చే బస్సులు, ఆటోలను ఎండాడ, మారికవలస కూడళ్ల వద్ద పోలీసులు నిలుపుదల చేసి లోనికి అనుమతించక పోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోను భారత్ విజయం సాధిస్తూ వచ్చింది.

శిఖర్, రహానే

శిఖర్, రహానే

ఇదే స్టేడియంలో ఆదివారం జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం ద్వారా తన విజయాల పరంపరను కొనసాగించింది.

శిఖర్, రహానే

శిఖర్, రహానే

ఇప్పటికే 1-1తో సిరీస్ సమం చేసిన భారత్, చివరి మ్యాచ్‌లో విజయం ద్వారా సిరీస్‌తో పాటు ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

దాదాపు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఆరు ఓవర్లకు ముందే పూర్తి కావడం గమనార్హం.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

ఇరు జట్లు కలిసి 40 ఓవర్లు ఆడాల్సి ఉండగా కేవలం 31.5 ఓవర్లలోనే ముగియడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది.

సచిన్ అభిమాని

సచిన్ అభిమాని

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంతో ఉత్కంఠత కనబరచిన ప్రేక్షకులు శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ల వికెట్లు పడిపోగా, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు సైతం క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు.

సచిన్ అభిమాని

సచిన్ అభిమాని

ఇక భారత్ బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ హిట్టింగ్ చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

మ్యాచుకు ముందు కసరత్తులు

మ్యాచుకు ముందు కసరత్తులు

కేవలం 13 పరుగులకే రోహిత్ పెవిలియన్‌కు చేరుకోగా శిఖర్ ధావన్, అజ్యింక రహానే మ్యాచ్‌ను ముగించేశారు.

టీమిండియా కసరత్తులు

టీమిండియా కసరత్తులు

దీంతో ధోనీ, రైనా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌లో మెరుపులు చూద్దామనుకున్నా ఆ అవకాశం దక్కలేదు.

యువరాజ్ కసరత్తు

యువరాజ్ కసరత్తు

మ్యాచుకు ముందు టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ కసరత్తులు.

అశ్విన్

అశ్విన్

నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో కీలక భూమిక పోషించాడు రవిచంద్రన్ అశ్విన్.

వికెట్ పడింది

వికెట్ పడింది

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంతో ఉత్కంఠత కనబరచిన ప్రేక్షకులు శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ల వికెట్లు పడిపోగా, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు సైతం క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు.

సిరీస్ మనదే

సిరీస్ మనదే

ఇప్పటికే 1-1తో సిరీస్ సమం చేసిన భారత్, చివరి మ్యాచ్‌లో విజయం ద్వారా సిరీస్‌తో పాటు ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

English summary
Visakhapatnam fans enjoyed the India Vs Srilanka t20 math held on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X