అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ పోర్ట్ గెస్ట్‌హౌస్: రాజ్‌భవన్‌గా కాదు..క్యాంపు కార్యాలయం వైపే మొగ్గు..!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో అధికార యంత్రాంగం మరో అండుకు వేసింది. సచివాలయం కోసం రుషికొండ మధురవాడ ప్రాంతంలోని మిలీనియం టవర్స్‌ను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులకు ఎదురైన ఇబ్బందులు.. రాజ్‌భవన్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. ఈ రెండింటి కోసం అధికారులు కొన్ని భవనాలను ఇదివరకే పరిశీలించినప్పటికీ.. ఓ పట్టాన కొలిక్కి రాలేదు. అప్పట్లో వారు పరిశీలించిన భవనాల జాబితాలో విశాఖ పోర్ట్ గెస్ట్‌హౌస్ కూడా ఉంది.

వెంకటేశ్వర స్వామివారి రథానికి దుండగుల నిప్పు: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న సమయంలో..వెంకటేశ్వర స్వామివారి రథానికి దుండగుల నిప్పు: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న సమయంలో..

విశాఖపట్నం నుంచి పరిపాలనను చేపట్టిన తరువాత.. రాజ్‌భవన్ కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. రాజ్‌భవన్, సచివాలయం సహా వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖపట్నానికి తరలి వెళ్తాయంటూ ఇదివరకు మంత్రివర్గ సమావేశం ఆమోదించిన తీర్మానంలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో- సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు రాజ్‌భవన్ కోసం అనువైన భవనాలను అధికారులు పరిశీలించారు.

Visakha Port Guest House is likely to be modified as CM YS Jagan Camp Office

ఇందులో భాగంగా పోర్ట్ గెస్ట్‌హౌస్‌ను కూడా పరిశీలించారు. రాజ్‌భవన్‌గా మార్చడానికి అనువుగా ఉంటుందని తొలుత భావించారు. ఈ గెస్ట్‌హౌస్‌ను గవర్నర్ అధికారిక నివాసంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయానికి పంపించారు. అదే సమయంలో- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అవసరమైన, అనువైన భవనాలు వారి కంట్లో పడలేదు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రతిష్ఠాత్మక ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన కొన్ని భవనాలను అధికారులు పరిశీలించారు. యూనివర్శిటీ నుంచి మిలీనియం టవర్స్ మధ్య దూరం అధికం కావటం వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌ను అప్పటికప్పుడు తరలించాల్సిన అవసరం లేనందున.. దాని కోసమంటూ గుర్తించిన పోర్ట్ గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అంగీకారాన్ని ఇంకా తెలియజేయాల్సి ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
Visakha Port Guest house is likely to be modified as Chief Minister of Andhra Pradesh YS Jagan's Camp office after shifting the Secretariat from Amaravati to Visakhapatnam. Government Officers still searching for suitable buildings for their residence and Administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X