విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు జగన్ చెప్పిందే ఇప్పుడు అసెంబ్లీలో బిల్లుగా .. విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత శాసన సభ సమావేశాల్లో చివరి రోజు ఏపీ రాజధాని విషయంలో మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది అంటూ చేసిన ప్రకటనే యాజ్ ఇట్ ఈజ్‌గా సోమవారం అసెంబ్లీలోకి బిల్లు రూపంలో వచ్చింది. సీఎం జగన్ తాను ఏది అనుకున్నారో రాజధాని విషయంలో అదే చేశారు. ఎవరెన్ని ఆందోళనలు చేసినా తన మాటే శాసనం అన్నట్టు వ్యవహరించారు . విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో బిల్లు పెట్టారు .

అసెంబ్లీలో ఆ బిల్లులు వ్యతిరేకించండి .... రాపాకకు ఘాటు లేఖ రాసిన పవన్ కళ్యాణ్..అసెంబ్లీలో ఆ బిల్లులు వ్యతిరేకించండి .... రాపాకకు ఘాటు లేఖ రాసిన పవన్ కళ్యాణ్..

మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు

మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు

హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించిన కేబినెట్ కమిటీ సూచనల మేరకు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యటానికి దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా , అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

Recommended Video

AP Assembly : AP Finance Minister Buggana Rajendranath Reddy Brief Explanation On Three Capitals !
 రాజధాని రైతుల ఆందోళనలు లెక్కచెయ్యని సీఎం జగన్

రాజధాని రైతుల ఆందోళనలు లెక్కచెయ్యని సీఎం జగన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుకున్నదే చేశారు . ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ , ఆ తర్వాత బోస్టన్ కమిటీ ని నియమించి వారిచ్చిన నివేదికల ఆధారంగా ఫైనల్ గా హై పవర్ కమిటీని వేసిన సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యనున్నారు. ఏపీలో రాజధాని అమరావతిలో రైతులు 33 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం నేడు ఫైనల్ గా మూడు రాజధానులకు , అధికార , పరిపాలనా వికేంద్రీకరణకు మొగ్గు చూపి నిర్ణయం తీసుకుంది .

సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ విభాగాలతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ

సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ విభాగాలతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ

ఇక మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖపట్నం నగరానికే ఎక్కువ ప్రయోజనం చేకూరనుందని తాజా నిర్ణయంతో అర్ధం అవుతుంది . అయితే గతంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపులిచ్చిన నివేదిక నుంచి కొన్ని అంశాలను మాత్రం మినహాయించి సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ విభాగాల హెడ్ క్వార్టర్స్ ఇలా అన్నీ విశాఖ నగరంలోనే ఏర్పాటు కానున్నాయి. శాసనసభా కార్యకలాపాలు నిర్వహించే సచివాలయం మాత్రం అమరావతిలో ఏర్పాటు కానుంది.

 విశాఖపైనే జగన్ ఫోకస్ .. ఏకపక్ష నిర్ణయం అన్న ప్రతిపక్షాలు

విశాఖపైనే జగన్ ఫోకస్ .. ఏకపక్ష నిర్ణయం అన్న ప్రతిపక్షాలు

కేవలం సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప మిగితా అధికారిక కార్యక్రమాలన్నీ విశాఖలోనే జరగనున్నాయి . ఎక్కువ ఫోకస్ విశాఖ నగరంపైనే పెట్టిన జగన్ ఆయన అనుకున్నదే చేశారు. కమిటీలను ఏర్పాటు చేసిన జగన్ కమిటీల అభిప్రాయం రాక ముందే మూడు రాజధానులు ఏర్పాటు అంశం ప్రస్తావించారు. అయితే ఇదంతా కావాలని టీడీపీ మీద కక్షతో సీఎం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావటంతో విశాఖ వాసులు సంబరాల్లో ఉన్నారు.

English summary
AP Chief Minister Jagan made the bill into the Assembly on Monday as the announcement that the last day of the last Assembly session. He announced would have three capitals in the AP. CM Jagan has done the same for what he thought was capital. Whoever had concerns, he acted according to his statute. Vishakha was decided as Executive Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X