వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీలా క్రికెటర్‌గా మారి వస్తా: పేరెంట్స్‌ను కంగారుపెట్టిన బాలుడు

'ఇంటి నుంచి వెళ్తున్నా. అయిదేళ్ల తర్వాత క్రికెటర్ అయి వస్తా. అప్పటి వరకు నన్ను వెతకొద్దు' అంటూ ఓ బాలుడు లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని అచూకీ లభ్యమైంది.

|
Google Oneindia TeluguNews

విశాఖ: 'ఇంటి నుంచి వెళ్తున్నా. అయిదేళ్ల తర్వాత క్రికెటర్ అయి వస్తా. అప్పటి వరకు నన్ను వెతకొద్దు' అంటూ ఓ బాలుడు లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని అచూకీ లభ్యమైంది.

ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖలోని గోపాలపట్నం దరి శ్రీరామ్ నగర్‌కు చెందిన పన్నెండేళ్ల బాలుడు భువ‌న‌సాయికి క్రికెట్ అంటే పిచ్చి. తాను ధోనీలా క్రికెట‌ర్‌ని కావాల‌ని క‌ల‌లు క‌నేవాడు.

ఇంటి నుంచి వెళ్లిపోతూ..

ఇంటి నుంచి వెళ్లిపోతూ..

ఈ క్ర‌మంలోనే ఇంటి నుంచి వెళ్లిపోతూ.. త‌న తండ్రి జేబులో ఉన్న రూ.8000, ఓ ఏటీఎం కార్డు తీసుకుని, ఓ లెట‌ర్ రాసిపెట్టి బ‌య‌ట‌కు పారిపోయాడు.

ఐదేళ్ల తర్వాత తిరిగి వస్తానని...

ఐదేళ్ల తర్వాత తిరిగి వస్తానని...

తాను ఢిల్లీకి వెళ్లి క్రికెట‌ర్‌ని అవుతాన‌ని, ఐదేళ్ల తర్వాత మ‌ళ్లీ తిరిగి వ‌స్తానని అందులో పేర్కొన్నాడు. త‌న గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే తాను ఎప్ప‌టికీ ఇంటికి రాన‌ని లేఖ‌లో బెదిరించాడు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భువనసాయిని గుర్తించిన ప్రయాణీకులు

భువనసాయిని గుర్తించిన ప్రయాణీకులు

పోలీసులు ఆ బాలుడి కోసం గాలించారు. ఆ బాలుడు ఏటీఎం కార్డు నుంచి డ‌బ్బు తీస్తే అత‌డు ఎక్క‌డ ఉన్నాడో తెలుసుకోవ‌చ్చ‌ని పోలీసులు భావించారు. ఆ తర్వాత పోలీసులకు భువన సాయి ఆచూకీ లభించింది. రైల్లో ప్రయాణిస్తున్న భువన సాయిని ప్రయాణీకులు గుర్తించి, ఈ సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేశారు.

సామర్ల కోట రైల్వే స్టేషన్ సమీపంలో..

సామర్ల కోట రైల్వే స్టేషన్ సమీపంలో..

తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట రైల్వేస్టేషన్ కు సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా ఈ సమాచారం భువనసాయి తల్లిదండ్రులకు చేరింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

English summary
visakhapatnam boy left his house for will become a cricketer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X