వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింహాచలం అప్పన్న నిజరూపం..లైవ్: సంచయిత తొలిపూజ: అశోక గజపతి రాజు గైర్హాజర్.. తొలిసారిగా

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రఖ్యాతి గాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చందనోత్సవాలు ఆదివారం ఆరంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో..ఈ సారి భక్తులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సింహాచలం ఆలయ ట్రస్టీ సంచయిత స్వామివారికి తొలిపూజ చేశారు. అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు గైర్హాజర్‌లో చందనోత్సవాలను నిర్వహించడం ఇదే తొలిసారి.

ఆలయ ట్రస్టీ సంచయిత ఈ తెల్లవారు జామున వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంచయిత స్వామివారికి తొలిపూజను సమర్పించారు. తొలుత సుప్రభాత సేవ, అనంతరం చందనోత్తరణను నిర్వహించారు. సింహాచలేశుని నిజరూప దర్శనాన్ని కల్పించారు. తొలి దర్శనం తరువాత వీవీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలు ఉంటాయి. కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నందున.. అన్ని రకాల దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. భక్తులు లేకుండా చందనోత్సవాలు ఆరంభం అయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న భక్తుల కోసం మూలవిరాట్టు నిజరూప దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఏటా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున వరాహ లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రతి సంవత్సరం అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తోన్న పూసపాటి వంశీయుల తరఫున కేంద్ర మాజీమంత్రి ఈ ఉత్సవాలను ప్రారంభిస్తుంటారు. అశోక గజపతి రాజుకు బదులుగా ఆయన కుటుంబానికే చెందిన సంచయిత గజపతి రాజును అనువంశిక ధర్మకర్తగా నియమించింది ప్రభుత్వం. దీనితో సంచయిత సింహాచలం అప్పన్నకు తొలిపూజను అందజేశారు.

Visakhapatnam: Chandanotsavam performed began at Simhachalam temple

వేలాదిమంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించాల్సిన ఈ వేడుకలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. ఫలితంగా అతి కొద్ది మంది మాత్రమే ఈ అపురూప ఘట్టానికి హాజరు అయ్యారు. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పరిమితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకుల సంఖ్య కూడా తక్కువగానే కనిపించింది. స్వామి వారికి నిర్వహించాల్సిన పూజలు, నిత్య కైంకర్యాల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని ఆలయ అధికారులు తెలిపారు. చందనోత్సవ సమయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ యధాతథంగా చేపడతామని, భక్తులను మాత్రమే అనుమతించట్లేదని అన్నారు.

Recommended Video

Viswa Hindu Parishad Questions To AP Govt Over The New Appointments In Mansas trust

English summary
The annual ‘Chandanotsavam’ of Sri Varaha Lakshmi Narasimha Swamy atop Simhachalam here on April 26 will be performed by temple priests and will be out of bounds to devotees owing to the COVID-19 lockdown. On Vaisakha Suddha Tadiya, popularly known as ‘Akshaya Tritiya’, every year the layers of sandalwood paste covering the deity are ceremonially removed and a large number of devotees worship ‘Him’ in the ‘nijarupa’ on a single day. The annual ‘nijarupa darshan’ begins in the early hours and the next day in the small hours the deity is again covered with sandalwood paste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X