విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vishakapatnam: మహిళలకు అనువైన నగరంగా విశాఖ.. టాప్-10 నగరాల్లో చోటు..

మహిళలకు అనువైన నగరాల్లో విశాఖపట్నం చోటు దక్కించుకుంది. టాప్-10 నగరాల్లో వైజాగ్ ఏ స్థానంలో నిలిచిందంటే..

|
Google Oneindia TeluguNews

ఆడవారు ఎలాంటి భయం లేకుండా జాబ్స్ చేసుకోవడానికి అనువైన టాప్-10 నగరాల్లో విశాఖపట్నం స్థానం దక్కించుకుంది. 'టాప్‌ సిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా' పేరుతో అవతార్‌ గ్రూప్‌ అనే సంస్థ దేశంలోని 111 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు రాణించడానికి దేశంలో అనుకూలమైన నగరాల్లో అధ్యయనం నిర్వహించారు.

ఆయా నగరాల్లో నేరాల రికార్డు, లివింగ్‌ ఇండెక్స్, మహిళా, శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదికలు, ఇతర విభాగాల నుంచి సేకరించిన 200కు పైగా అంశాలను విశ్లేషించి టాప్-10 నగరాలను ఎంపిక చేశారు. 10 లక్షల జనాభా పైబడిన(కేటగిరి-1), 10 లక్షల లోపు జనాభా నగరాలు (కేటగిరి-2) అనే రెండు విభాగాలుగా విభజించి అధ్యయనం చేశారు.

Visakhapatnam is the ideal city for women

అవతార్‌ గ్రూప్‌ కేటగిరి-1లో 49 నగరాలు, కేటగిరి-2లో 62 నగరాల్లో అధ్యయనం చేసింది. కేటగిరి-1 నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో నివులువగా.. పుణె, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ విభాగంలో విశాఖకు ఏడో స్థానం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ నగరం 14వ స్థానంలో నిలిచింది. విజయవాడ 19వ స్థానం దక్కించుకుంది.

కేటగిరి-2లో తమిళనాడుకు చెందిన తిరుచిరాపల్లి, వెల్లూర్, ఈరోడ్, సేలం, తిరుప్పూర్‌ నగరాలు వరుసగా ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ విభాగంలో కాకినాడ 12వ స్థానంలో నిలిచింది.

English summary
Visakhapatnam is among the top 10 cities where women can get jobs without any fear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X