విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో ఐపీఎల్?: మ్యాచ్‌ల నిర్వహణకు ముంబై ఫ్రాంఛైజీ ఆసక్తి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నానికి అనుకోకుండా అదృష్టం వరించేలా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో కొన్ని మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. తీవ్రనీటి ఎద్దడి, కరువు కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రత్యమ్నాయ వేదికలను పరిశీలిస్తున్నారు.

దీంతో లీగ్‌ నిర్వాహకులకు విశాఖపట్నం ఓ ప్రత్యామ్నాయంలా కనిపిస్తోంది. వైజాగ్‌తో పాటు రాయ్‌పుర్‌, కాన్పుర్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెలలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సిన మూడు మ్యాచ్‌లు ఇక్కడకు బదిలీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే పుణెలో జరగాల్సిన రెండు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు.. ముంబై ఆతిథ్యమివ్వాల్సిన ఫైనల్‌ను మాత్రం ఈ మూడు వేదికలకు కేటాయించే అవకాశాల్లేవు. ఈ మ్యాచ్‌ల కోసం ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా పరిశీలనలో ఉన్నట్లు ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తెలిపాడు.

Visakhapatnam, Raipur, Kanpur shortlisted as alternative IPL venues

ఏప్రిల్‌ 30 తర్వాత జరిగే 13 మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కోసం రాజీవ్‌ శుక్లా ముంబై, పుణె ఫ్రాంచైజీలతో ఢిల్లీలో శుక్రవారం సమావేశం కానున్నారు. ఇందులో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు ముంబయి, పుణె ఫ్రాంఛైజీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు.

ఈ సమావేశంలో ముంబై ఇండియన్స్‌ ఆడే మూడు మ్యాచ్‌లను విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ)తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో సన్‌రైజర్స్‌, డెక్కన్‌ చార్జర్స్‌ మ్యాచ్‌లను విశాఖలో విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

దీంతో ముంబై ఫ్రాంచైజీ కూడా విశాఖలో మ్యాచ్‌ల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మే 8న ముంబై ఇండియన్స్‌-సన్‌రైజర్స్‌, 13న కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌, 15న ఢిల్లీ డేర్‌ డెవెల్స్‌-ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం విశాఖ క్రికెట్ అభిమానులకు కలుగుతుంది.

మరోవైపు పుణెలో జరగాల్సిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఢిల్లీ అండ్‌ డిస్ర్టిక్ట్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) ముందుకొచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం పుణెలో వచ్చే నెల 25, 27 తేదీల్లో ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లు జరగాలి. కాగా, మహరాష్ట్ర నుంచి తరలిపోయే మ్యాచ్‌ల్లో కొన్నింటిని నిర్వహించేందుకు కటక్‌ కూడా ఆసక్తి చూపడం విశేషం.

English summary
IPL chairman Rajiv Shukla has said that Visakhapatnam, Raipur and Kanpur are frontrunners as alternative home venues for Mumbai Indians and Rising Pune Supergiants after a Bombay High Court ruling ordered matches after April 30 to be moved out of Maharashtra due to a state-wide drought.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X