వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మలమ్మా.. అమ్మకం ఆపమ్మా: సాయిరెడ్డి వినతి -విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలతో కలిసి ఢిల్లీలో భేటీ, ఇంకా

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఢిల్లీలోనూ హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు ఢిల్లీలో హల్ చల్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిలిచిపోయేలా బీజేపీయేతర పార్టీల మద్దతు కూడట్టేందుకుగానూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ప్రస్తుతం ఢిల్లీలో వివిధ వర్గాలను కలుస్తున్నారు. ఆ నేతలను ఉద్దేశించి టీడీపీ చీఫ్ చంద్రబాబు వ్యూహాత్మక లేఖ రాసిన సమయంలోనే.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అదేనాయకులను వెంటేసుకుని కేంద్రం పెద్దల చెంతకు వెళ్లారు..

Recommended Video

Vizag Steel Plant : కార్మికుల పోరాటం ఉధృతరూపం.. జగన్ సర్కార్ పై ఒత్తిడి..!!

షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూషాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

నిర్మలమ్మతో సాయిరెడ్డి భేటీ

నిర్మలమ్మతో సాయిరెడ్డి భేటీ

వైసీపీ జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో కలిసి మంత్రితో భేటీ అయిన సాయిరెడ్డి.. స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని, ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్మలకు సమర్పించిన వినతి పత్రంలో కీలక అంశాలను ప్రస్తావించారు..

జగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10th‌కూ మార్కులుజగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10th‌కూ మార్కులు

సొంత గనులు, ఈక్విటీ ఇస్తే..

సొంత గనులు, ఈక్విటీ ఇస్తే..

చాలా ఏళ్ల పోరాటం, 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు..నవరత్నగా నిలిచిన ఏపీకే ఆభరణంగా ఉందని, 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయని, కరోనా సమయంలో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సీజన్‌ సరఫరా చేసిందని, కేవలం సొంత గనులు లేనందునే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను చవిచూడాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి విజయసాయిరెడ్డి వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి నిర్మలను సాయిరెడ్డికోరారు. కాగా,

అటు బాబు అస్త్రం, ఇటు సాయిరెడ్డి వ్యూహం

అటు బాబు అస్త్రం, ఇటు సాయిరెడ్డి వ్యూహం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మళ్లీ వేడి రాజుకుంది. ప్రైవేటీకరణను ఆడ్డుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్ధమని, ఈ పోరాటానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని చంద్రబాబు సవాలు చేశారు. ఈ మేరకు విశాక కార్మిక సంఘాల నేతలకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. సరిగ్గా చంద్రబాబు లేఖ బయటికొచ్చిన సమయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవడం గమనార్హం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగబోదని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేయగా, బాబు రాజీనామా అస్త్రం, సాయిరెడ్డి భేటీల వ్యూహం ఏమేరకు ఫలితాలిన్నాయో చూడాలి..

English summary
ysrcp parliamentary party leader Vijayasai Reddy has appealed to Union Finance Minister Nirmala Sitharaman to withdraw the thought of ​privatisation of Visakhapatnam Steel Plant (RINL). along with representatives of stel plant workers unions, sai reddy on friday meets nirmala in delhi. meanwhile, chandrababu wrote a letter to union leaders on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X