వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిచెన్ లోకి ఈడ్చుక్కెళ్లి.. పిల్లల ముందే వివాహితపై గ్యాంగ్ రేప్!

ఆపై వివాహితనను కిచెన్ లోకి ఈడ్చుక్కెళ్లి.. ఆమె పిల్లల ముందే పురుషోత్తం, వెంకటేష్ లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దౌర్జన్యానికి పాల్పడి అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల పేరు చెప్పి వివాహిత ఇంట్లో చొరబడ్డ నిందితులు.. తొలుత డబ్బు కోసం డిమాండ్ చేశారు. ఆపై బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం గాజువాక పరిధిలోని భానోజీ తోట ప్రాంతంలో ఒక వివాహిత(35) ఇంట్లోకి ఈ నెల 3న ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడ్డారు. వీరిలో పురుషోత్తం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన వెంకటేష్, హర్షరాజుతో పాటు మరో బాలుడు ఉన్నట్లు గుర్తించారు.

Visakhapatnam: Woman ‘gang-raped’ in front of her children, four arrested

ఇంట్లోకి చొరబడ్డ నిందితులు.. తాము పోలీసులమని, ఈ ఇంట్లో అత్యాచారం జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని డ్రామా ఆడారు. అలాంటిదేమి లేదని వివాహిత ఎంత చెప్పినా వినలేదు. ఇంట్లో బీరువాలోంచి రూ.650ని బలవంతంగా లాక్కున్నారు.

ఆపై వివాహితనను కిచెన్ లోకి ఈడ్చుక్కెళ్లి.. ఆమె పిల్లల ముందే పురుషోత్తం, వెంకటేష్ లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడినుంచి వెళ్లేముందు.. తిరిగి రేపు కూడా వస్తామని, ఆలోపు డబ్బు సిద్దం చేసి ఉంచాలని బెదిరించారు. మరుసటి రోజు ఫోన్ చేసిన బాలుడు.. మీ ఇంటికి దగ్గర్లోని పెట్రోల్ బంకు వద్ద ఉన్నానని, డబ్బు తీసుకురావాలని ఆదేశించాడు. దీంతో భయాందోళనకు గురైన వివాహిత గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్ 376కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోను వీరిపై కేసులు ఉన్నాయని గుర్తించారు. నిందితుల్లో ముగ్గురిని రిమాండ్‌కు, బాలుడిన జువైనల్ హోమ్‌కు తరలించారు. మంగళవారం నాడు ఈ ఘటన జరగ్గా.. అత్యాచారం జరిగిన రోజు రాత్రి వివాహిత భర్త వేరే ఊరికి వెళ్లినట్లు తెలిపారు.

English summary
A 35-year-old woman was allegedly raped by two men in front of her three children in her house in the city on Monday, the police said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X