వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముమ్మాటికీ తప్పే: జగన్ పార్టీకి విష్ణుకుమార్ రాజు మద్దతు

రవాణా శాఖ అధికారి బాల సుబ్రహ్మణ్యం పట్ల తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సోమవారం శాసనభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు భారతీయ జనతా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రవాణా శాఖ అధికారి బాల సుబ్రహ్మణ్యం పట్ల తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సోమవారం శాసనభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు పలికారు.

ప్రభుత్వ అధికారుల పట్ల తెలుగుదేశం నేతలు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో ఎవరున్నా శిక్షించాల్సిందేనని అన్నారు. అధికారులపై దాడులు చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళన సమంజసమేనని ఆయన అన్నారు. బీజేపీ న్యాయం ఎవరివైపు ఉంటే.. అటువైపు ఉంటుందని అన్నారు.

<strong>చెవిరెడ్డి అరెస్ట్, వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు, ఉద్రిక్తత: చిన్న విషయమన్న కాల్వ</strong>చెవిరెడ్డి అరెస్ట్, వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు, ఉద్రిక్తత: చిన్న విషయమన్న కాల్వ

రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని విష్ణుకుమార్‌రాజు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో రవాణాశాఖ కమిషనర్‌ పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు.

Vishnukumar Raju supports YSR Congress party members protest

అధికారులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించకూడదని సూచించారు. ఇలాంటి ప్రవర్తనతో రాజధాని ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ముఖ్యమంత్రి వాళ్లని పిలిచి మందలించడం మంచి పరిణామమని.. వారు కూడా కమిషనర్‌ క్షమాపణ చెప్పి తమ గౌరవాన్ని కొంత కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు.

విశాఖ ల్యాండ్ పూలింగ్ పై చర్చ

విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో వెయ్యి ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులు లాక్కున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. పేదల భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ల్యాండ్ పూలింగ్ ఇస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

English summary
BJP MLA Vishnukumar Raju on Monday supported YSR Congress party members protest against MP Keshineni Nani and MLA Bonda Umamaheswara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X