• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబాయి హంతకులను,కోడికత్తి దాడి కారకులను జగన్ ఇంకా పట్టుకోలేకపోయారు : పవన్ కళ్యాణ్

|

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలలో కూడా ఆయన వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు అసలేం జరిగిందో మిస్టరీగా మిగిలిన కేసుల గురించి ప్రశ్నించారు.

ఇసుక విధానమే ప్రభుత్వ పతనానికి నాంది : పవన్ కళ్యాణ్

 ఐదునెలల పాలనలో ఏం చేశారని ప్రశ్నించిన పవన్ కళ్యాన్

ఐదునెలల పాలనలో ఏం చేశారని ప్రశ్నించిన పవన్ కళ్యాన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్యచేశారో, ఎందుకు హత్య చేశారో తెలుసుకోలేక పోయారని వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు కోడి కత్తితో దాడి చేయించింది ఎవరో తెలుసుకోలేని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. ఐదు నెలల పరిపాలన కాలంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండు ఘటనలకు సంబంధించిన దోషులను గుర్తించలేకపోయిన సీఎం ప్రజలకు ఏం భరోసా ఇస్తారని జనసేన పార్టీ అధ్యక్షలు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నా దోషులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్న

అధికారంలో ఉన్నా దోషులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్న

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నాడు నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, అభ్యర్ధులతో సమావేశం అయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో అధికారంలో లేని నాడు గత ప్రభుత్వం కావాలని కేసులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు గుప్పించారని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ అన్నారు. ఇక ఏపీలో అధికారం చేపట్టినప్పటికీ దోషులను ఎందుకు పట్టుకో లేక పోతున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం భరోసా ఇస్తారన్న పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం భరోసా ఇస్తారన్న పవన్ కళ్యాణ్

మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రభుత్వం మీదే అయి, ముఖ్యమంత్రి మీరే కాబట్టి దోషులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరారు. లేదంటే ప్రజలు ఎలా మిమ్మల్ని విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఈ కేసులను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తే ప్రజలు ఈ రెండు ఘటనలను వేరే విధంగా అర్ధం చేసుకునే అవకాశం ఉందని జనసేనాని హెచ్చరించారు.ఇక అంతే కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఖండించానన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రకటన కూడా ఇచ్చానని తెలిపారు.

వివేకా హత్యకేసు, కోడికత్తి దాడి కేసు త్వరగా తేల్చాలని డిమాండ్

వివేకా హత్యకేసు, కోడికత్తి దాడి కేసు త్వరగా తేల్చాలని డిమాండ్

ఆనాడు రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులను ఆశ్రయించారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది వైసిపి ప్రభుత్వమే కాబట్టి త్వరితగతిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేసింది ఎవరో, కోడికత్తితో దాడి చేయడానికి ఆ కుర్రాడిని ప్రేరేపించింది ఎవరు..? బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తుంది ఎవరో తెలుసుకోవాలని ఆయన జగన్ కు సూచించారు. ప్రభుత్వం మీదే ఉంది ఎందుకు పొడిచాడో బయటపెట్టలేకపోతున్నారా అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఈ కేసుల విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను త్వరితగతిన తొలగించాలని, అది వైసీపీ ప్రభుత్వం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five months have gone by and so far, it is not known who killed YS Vivekananda Reddy and why. He added that a person attacked jagan with knife who is behind of the attack . The Janasena party president Pawan Kalyan questioned the CM to identify the culprits of the two incidents. It is not happened even though the YCP government is in power during the five-month rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more