కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకాది హ‌త్యే : ఏడు క‌త్తి పోట్లు గుర్తింపు : పోస్టుమార్టం లో తేల్చిన వైద్యులు..!

|
Google Oneindia TeluguNews

వైయ‌స్ వివేకానంద‌రెడ్డిది హ‌త్యేన‌ని పోలీసులు తేల్చారు. ఆయ‌న శ‌రీరం మీద ఏడు క‌త్తిపోట్లు ఉన్న‌ట్లుగా పోస్టుమా ర్టం స‌మ‌యంలో వైద్యులు గుర్తించారు. మెడ వెనుక భాగంలో మ‌రో గాయం బ‌ట‌య ప‌డింది. ఈ కేసు విచార‌ణ‌కు ఏపి ప్ర‌భుత్వ సీనియ‌ర్ పోలీసు అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.

<strong>వివేకా మృతి పై అనుమానాలు : విచార‌ణకు సిట్ ఏర్పాటు : రాజ‌కీయ విమ‌ర్శ‌లు షురూ..!</strong>వివేకా మృతి పై అనుమానాలు : విచార‌ణకు సిట్ ఏర్పాటు : రాజ‌కీయ విమ‌ర్శ‌లు షురూ..!

హ‌త్యేన‌ని నిర్ధార‌ణ‌..

హ‌త్యేన‌ని నిర్ధార‌ణ‌..

ఉద‌యం నుండి అనేక మ‌లుపులు తిరుగుతున్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి ది సాధార‌ణ మృతి కాదు...హ‌త్యేన‌ని తేలిం ది. తొలుత వివేకా గుండె పోటుతో మ‌ర‌ణించార‌ని అందరూ భావించారు. అయితే, ఆయ‌న నిద్రించిన గ‌దిలో ర‌క్తం ఉండ‌టం..బాత్రూం లో ర‌క్తం మ‌డుగు లో వివేకా మృత‌దేహం ప‌డి ఉండ‌టంతో దీని పై ఆయ‌న పిఏ పోలీసులకు ఫిర్యా దు చేసారు. దీని పై స్థానిక పోలీసులు ప్రాధ‌మిక విచార‌ణ చేసారు. మృత‌దేహాన్ని పోస్టు మార్టం కోసం పులివెందుల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోస్టు మార్టంలో ఆయ‌న శ‌రీరం పై ఏడు క‌త్తి పోట్లు ఉన్న‌ట్లుగా గుర్తించారు. మెడ ముందు.. వెనుక‌, చేతి మీద‌, తొడ మీద క‌త్తి తో గాయాలు చేసిన‌ట్లు గా తేల్చారు. దీంతో..పోలీసులు వివేకా ది హ‌త్య‌గా తేల్చారు.

నిందితులు ఎవ‌రు..సిట్ ఏర్పాటు..

నిందితులు ఎవ‌రు..సిట్ ఏర్పాటు..

అనుమానస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్ప‌టికే డాగ్ స్క్వాడ్‌..క్లూస్ టీంలు ఘ‌టనా స్థ‌లిలో ఆధారాలు సేక‌రించాయి. దీని పై ముఖ్య‌మంత్రి ఉన్న‌త స్థాయి పోలీసుల‌తో స‌మీక్షించారు.

రెండు క‌త్తి పోట్లు ఉన్న‌ట్లు పోలీసులు

రెండు క‌త్తి పోట్లు ఉన్న‌ట్లు పోలీసులు

హ‌త్య ఎవ‌రు చేసార‌నే అంశం పై ద‌ర్యాప్తు ప్రారం భించారు. వివేకా త‌ల పై రెండు..చేతుల పై రెండు క‌త్తి పోట్లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇప్ప‌టికే వేలి ముద్ర లు సేక‌రించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 11 గంట‌ల నుండి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఇంటి ఎవ‌రు వ‌చ్చా రు..ఎవ‌రు ఈ హ‌త్యు పాల్ప‌డ్డార‌నే దాని పై విచార‌ణ ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో వైసిపి..టిడిపి క‌డ‌ప జిల్లా నేత‌ల మ‌ధ్య వివేకా హ‌త్య పై రాజ‌కీయంగా దుమారం మొద‌లైంది.

English summary
Police identified Viveka's death is not ordinary its murder in their primary investigation. In post mortam doctors identified seven injuries with knife and one behind neck. AP Govt appointed SIT to investigate this murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X