విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ జిల్లాలో ఆర్టీసీ బస్సులో పేలుడు! ఒకరికి తీవ్ర గాయాలు

వెళుతున్న ఆర్టీసీ బస్సులో అనూహ్యంగా పేలుడు సంభవించింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు గ్రామ సమీపంలోని పర్యాటక శాఖ వ్యూ పాయింట్‌ దగ్గర మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వెళుతున్న ఆర్టీసీ బస్సులో అనూహ్యంగా పేలుడు సంభవించింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు గ్రామ సమీపంలోని పర్యాటక శాఖ వ్యూ పాయింట్‌ దగ్గర మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

అరకు లోయ నుంచి శృంగవరపుకోటకు వెళ్తున్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనంతగిరి మండలం డముకు గ్రామ సమీపానికి బస్సు చేరుకుంది.

bomb-blast

అక్కడి పర్యాటక శాఖ వ్యూ పాయింట్‌ దగ్గరకు రాగానే ఒక్కసారిగా బస్సు వెనుక భాగంలో పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. బస్సు చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.

కిందికి దిగి చూడగా.. బస్సు వెనుక భాగం ధ్వంసమై ఉంది. దాంతోపాటు చిన్న ఇనుప వస్తువులు, అధిక సంఖ్యలో పాలిథిన్‌ సంచులు కాలిపోయి ఉన్నాయి. బస్సు డ్రైవర్ ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
An explosion took place in a RTC Bus while travelling from Araku Vally to Srungavarapu Kota on Tuesday Night at 7.30 PM. When bus reached the view point of tourism department near damuku village, all of sudden this blast was occured. A person injured in this incident. Driver informed the police about this blast and they came to the spot and started investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X