• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కీచ‌క సీఐ ! లైంగిక వేధింపులు..కాళ్ల‌బేరం : స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సీపీ..!

|
  కీచ‌క సీఐ అడ్డంగా దొరికాడు లైంగిక వేధింపులు..!! || Oneindia Telugu

  పోలీసు శాఖ‌లోని ఓ కీచ‌క సీఐ అడ్డంగా దొరికాడు. ర‌క్ష‌ణ కోరిన మ‌హిళ‌ను వ‌ల‌పు వేధింపుల‌కు గురి చేసాడు. మ‌హిళా సంఘాలు జోక్యంతో తొలుత బుకాయించాడు. ఆ త‌రువాత సీఐ మాట‌ల రికార్డును బాధిత మ‌హిళ బ‌య‌ట పెట్టింది. దీంతో..కాళ్ళ బేరానికి వ‌చ్చాడు. పోలీసు క‌మిష‌న‌ర్ వ‌ర‌కు విష‌యం వెళ్ల‌టంతో స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది.

  బాధిత మ‌హిళ‌తో అస‌భ్యంగా..

  బాధిత మ‌హిళ‌తో అస‌భ్యంగా..

  ర‌క్ష‌ణ కోసం వ‌చ్చిన మ‌హిల‌తోనే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి అడ్డంగా దొరికి పోయాడు విశాఖ‌లోని ఓ సిఐ. ప్రేమించి మోస పోయిన త‌న సోద‌రి పెట్టిన కేసు పురోగ‌తిపై వాక‌బు చేసేందుకు య‌త్నించిన బాధితురాలి సోద‌రితో ఫోన్‌లో విశాఖ న‌గ‌రంలోని ఎంవీపీ సీఐ అస‌భ్యక‌రంగా మాట్లాడారు. ఎంవీపి కాల‌నీలో నివ‌సిస్తున్న బాధిత మ‌హిళ ఓ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆమెకు వ‌ర‌స‌కు బావ అయ్యే విజ‌య్ భాస్క‌ర్ ప్రేమ పేరుతో వంచించి లైంగికంగా లొంగ‌దీసుకున్నాడ‌ని ఎంవీపీ స్టేష‌న్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు న‌మోదు చేసారు. ఈ కేసు గురించి మాట్లాడ‌టానికి బాధిత మ‌హిళ‌తో పాటుగా ఆమె సోద‌రి ఆస్టేష‌న్‌కు ఎక్కువ‌గా వ‌స్తూ ఉన్నారు. ఇదే అద‌నుగా భావించిన కీచ‌క సీఐ త‌న దుర్బుద్దిని బ‌య‌ట పెట్టుకున్నాడు.

  బాధిత మ‌హిళ సోద‌రికి వేధింపులు..

  బాధిత మ‌హిళ సోద‌రికి వేధింపులు..

  బాధిత మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదుల పైన సీఐ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని బాధిత మ‌హిళ‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారు ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బాధిత మ‌హిళ సోద‌రికి పోన్ చేసి అస‌భ్య‌క‌రంగా మాట్లాడార‌ని చెబుతున్నారు. సీఐ స‌న్యాసినాయుడు బాధిత మ‌హిళ సోద‌రికి ఫోన్ చేసి ఎక్క‌డ ఉంటున్నారు..ఏం చ‌దువుతున్నారు..మీ ఇంటి అద్దె ఎంత అంటూ ఆరాలు తీయ‌టం మొద‌లు పెట్టారు. దీనికి కొన‌సాగింపుగా ఏ స‌మ‌యంలో ఫ్రీగా ఉంటావు..బీచ్‌కు ఎప్పుడు వ‌స్తావ్ అంటూ ట్రాప్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. పైగా..ఇద్ద‌రం ఒకటే సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లం అంటూ సీఐ వేధింపుల‌కు గురి చేసార‌ని బాధిత మ‌హిళ సోద‌రి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. తన అక్కకి అలా జరిగిందని, తాను కూడా అలాంటిదాన్నే అని భావిస్తున్నారా అని సీఐని ప్రశ్నించినా చులకనగా మాట్లాడారని మీనాక్షి ఆరోపించారు.

  కాళ్ల‌బేరం..స‌స్పెన్ష‌న్ వేటు..

  కాళ్ల‌బేరం..స‌స్పెన్ష‌న్ వేటు..

  బాధితురాలి ఫిర్యాదు మేర‌కు మ‌హిళా సంఘాల నేత‌లు బాధితురాలుతో కలిసి సీఐని నిలదీయగా... మొదట బుకాయించినప్పటికీ ఆడియో రికార్డింగ్‌ను వినిపించడంతో సీఐ కాళ్ల బేరానికి వచ్చాడు. ఇటువంటి సీఐపై సీపీ మహేష్‌చంద్ర లడ్డా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో..సీపీ..ఎంవీపీ సీఐ ఎన్‌.సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఝులిపించారు. ప్రేమించి మోసపోయానని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సోదరి పట్ల ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు అందడంతో సీపీ మహేష్‌చంద్రలడ్డా ఎంవీపీ సీఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  English summary
  Vizag Commissioner of Police suspended local Circel Inspector in Sexual Harassment against victim.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X