విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vizag Gas Leak: షాకింగ్ ట్విస్ట్.. ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు సీజ్.. ఏపీ హైకోర్టు మరో సంచలనం..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ కేసు ఊహించని మలుపులు తిరిగింది. వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు జగన్ సర్కారు చేస్తోన్న ప్రయత్నాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. స్టెరీన్ నిల్వలను తరలించడంతో గ్రామాలకు ముప్పు తప్పిపోయిందన్న వాదనను తోసిపుచ్చింది. అంతటితో ఊరుకోకుండా.. మోత్తం ఎల్జీ పాలిమర్స్ ప్లాంటునే సీజ్ చేయాలని, అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లరాదంటూ సంచలన రీతిలో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది.

డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

విశాఖ శివారు ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ విషవాయువు లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది ఆస్పత్రులపాలు కావడం, పదుల సంఖ్యలో మూగ జీవాలు చనిపోవడం, వేలాది ఎకరాల్లో పంటలు, చెట్లు దెబ్బతినడం తెలిసిందే. నాటి దుర్ఘటపై విచారణను హైకోర్టు సుమోటోగా స్వీకరిచగా, ఎల్జీ యాజమాన్యం తీరు, ప్రమాదం తర్వాత ప్రభుత్వం స్పందింన విధానాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రఖ్యాత అడ్వొకేట్ రాపోలు భాస్కర్ సైతం ఇంప్లీడ్ అయ్యారు. జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ లలితా కన్నెగంటి నేతృత్వంలోని ద్విసభ్య దర్మాసం ఆ పిటిషన్ ను విచారించి, శుక్రవారం సాయంత్రమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. ఆదివారం సాయంత్రానికిగానీ తీర్పు కాపీలు బయటికొచ్చాయి.

 ఎల్జీకి షాక్..

ఎల్జీకి షాక్..

లాక్ డౌన్ అనంతరం తిరిగి కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తోన్న ఎల్జీ పాలిమర్స్ ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. కోర్టుకు తెలియకుండా కంపెనీని పున: ప్రారంభించరాదని, అప్పటిదాకా ప్లాంటుతోపాటు ఆ పరిసర ప్రాంతాలనూ సీజ్ చేశాయలని, సంస్థ ప్రతినిధులను సైతం లోపలికి అనుమతించొద్దని, ఎల్జీ డైరెక్టర్లు దేశం విడిచి పారిపోకుండా ఉండేలా వెంటనే పాస్‌పోర్ట్‌ లను పోలీసులకు స్వాధీనపరచాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, ఘటన తర్వాత స్టెరీన్ నిల్వల తరలింపులో ఎవరి ఆదేశాలను పాటించారో స్పష్టంగా చెప్పాలని సంస్థను ఆదేశించింది.

 సర్కారుపై ప్రశ్నల వర్షం..

సర్కారుపై ప్రశ్నల వర్షం..

గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగి ఇన్ని రోజులు కావాస్తున్నా యాజమాన్యంపై కనీస చర్యలు తీసుకోకపోవడంలోని ఆంతర్యమేంటో చెప్పాలని, ఓ వైపు కమిటీల విచారణలు జరుగుతుండగా ఎల్జీ కంపెనీ డైరెక్టర్లను స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారో చెప్పాలని ఏపీ సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఎవరి అనుమతితో పరిశ్రను పున:ప్రారంభించాలనుకున్నారో వివరించాలని, ప్రమాదం తరువాత వేల టన్నుల స్టెరీన్ నిల్వలను ఎవరి అనుమతితో ఎక్కడికి తరలించాలో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.

కీలక నోటీసులు..

కీలక నోటీసులు..

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్న ప్రతిరవాదులందరికీ కోర్టు నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నవాళ్లలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్, కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ తోపాటు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ఉన్నారు. ప్రమాద ఘటనపై వివిధ కమిటీలు ఏర్పాటైన దరిమిలా, వాళ్లు తప్ప మిగతా ఎవరినీ ఎల్జీ ప్లాంటులోకి అడుగుపెట్టనీయరాదని జడ్జిలు ఆదేశించారు.

Recommended Video

VizagGasLeak: Venkatapuram Villagers Dharna At LG Polymers Demanding Job for Every Family in Village
వరుస షాకులు..

వరుస షాకులు..

జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన పలు జీవోలు, విధాన నిర్ణయాలకు ఆంధప్రదేశ్ హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటం చర్చనీయాంశమైంది. శుక్రవారం ఒక్కరోజే మూడు కీకమైన అంశాల్లో సర్కారుకు ఎదురుదెబ్బ తగినట్లు భావించినా, ఆ సంఖ్య 4 అని ఆదివారం నాటికి వెల్లడైంది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిన న్యాయస్థానం.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తేసింది, అలాగే, పంచాయితీ భవనాల రంగులకు సంబంధించిన జీవో 623ను కొట్టేసింది. వీటికితోడు ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు సీజ్, ఆ సంస్థ డైరెక్టర్ల పాస్ పోర్టుల స్వాధీనం ఆదేశాలు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో టీడీడీ భూముల అమ్మకాలపైనా పిటిషన్లు వేయాలని టీడీపీ భావిస్తున్నది.

English summary
major twist in Vizag Gas Leak case, Andhra Pradesh High Court ordered the seizure of the premises of the LG Polymers company in at RR venkatapuram and Directors To Not Leave India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X