విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయానకం- అచ్చు సినిమాలోలా.. ఎక్కడివారక్కడే - విశాఖ గ్యాస్ లీకేజీ సీసీ ఫుటేజ్ దృశ్యాలు....

|
Google Oneindia TeluguNews

ఏపీలోని విశాఖఫట్నంలో ఉన్న ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామంలో ఎల్జీపాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన స్టైరైన్ గ్యాస్ 12 మందిని బలితీసుకోగా.. వందలాది మంది బాధితులుగా మిగిలారు. ఇప్పటికీ అక్కడ గ్యాస్ ప్రభావం అక్కడక్కడా బయటపడుతూనే ఉంది. అయితే ఈ గ్యాస్ లీకేజీ ఎలా జరిగింది, గ్రామంలోకి గ్యాస్ ఎలా వ్యాపించిందో చూపే సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటపడింది. ఇందులో బాధితులు గ్యాస్ పీల్చి ఎలా కుప్పకూలిపోయారో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి మూడు, నాలుగు గంటల మధ్య గ్యాస్ లీక్ అయిన దృశ్యాలు, స్ధానికులు అప్రమత్తమై ఇళ్లలో నుంచి బయటికి రావడం, వెంటనే స్పహకోల్పోవడం వంటి దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే ఇళ్లలో నుంచి బయటికి రాగానే జనం ఒకరినొకరు పలుకరించుకునే సమయం కూడా దక్కలేదని అర్ధమవుతోంది. గ్యాస్ అనుమానంతో ఇళ్లలో నుంచి లైట్లు వేసి బయటికి వచ్చిన ప్రజలు కుప్పకూలిన దృశ్యాలు అక్కడ ఆ రోజు వాస్తవ పరిస్దితికి అద్ధం పడుతున్నాయి.

vizag gas leak cctv footage horrible visuals revealed

మరో ఫుటేజ్ లో ఉదయం ఆరు గంటల సమయంలో ఓ ఇంట్లోకి వెళ్తున్న వ్యక్తి అచ్చు మద్యం సేవించిన తరహాలో తూలుతూ నడుస్తూ కనిపించారు. ఈ సీన్ చూడగానే ఆయన గ్యాస్ పీల్చినట్లు స్పష్టంగా అర్దమవుతోంది. ఆ తర్వాత ఆయన పడిపోగా పోలీసులు వచ్చి ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

English summary
visakhapatnam police has released recent vizag gas leak visuals,which are horrible to see victims collapsed after smelling styrine. visuals shown that gas spreading across the villages also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X