• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైజాగ్ రాజధాని మాత్రమే కాదు సీఎం జగన్ నిర్ణయంతో అలా కూడా అభివృద్ధి బాటలో

|

సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకోవటం, విశాఖనే పరిపాలనా రాజధాని అని ప్రకటన చెయ్యటంతో విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని విశాఖ వాసులు సంబరపడ్డారు. ఇక తాజాగా రాజధానిగా మాత్రమే కాకుండా విశాఖను ఇండస్ట్రీయల్ కారిడార్ గా చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తుంది. ఇక సీఎం నిర్ణయాన్ని మంత్రులు విశాఖ వాసులకు చెప్పారు. దీంతో విశాఖ వాసుల్లో హర్షం వ్యక్తం అవుతుంది .

ఉగాది నుండి ఏపీలో విశాఖ వేదికగా పాలన ... వైసీపీ సర్కార్ తాజా వ్యూహం ఇదేనా ?

 ఇండస్ట్రియల్ కారిడార్ సదస్సులో పాల్గొన్న మంత్రులు

ఇండస్ట్రియల్ కారిడార్ సదస్సులో పాల్గొన్న మంత్రులు

విశాఖలో మంగళవారం జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ సదస్సులో ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు . వారు విశాఖలో వున్న చక్కటి వనరులను వినియోగించుకోవడం ద్వారా ఏపీని పారిశ్రామికంగా సంపూర్ణ స్థాయిలో అభివృద్ది పరచాలని సీఎం జగన్ భావించారు . ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన వైజాగ్‌ని రాజధానిగానే మాత్రమే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి పరచనున్నట్లు, అందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్.

ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధికి అడుగులు

ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధికి అడుగులు

ఇక అంతేకాదు విశాఖ త్వరలో ప్రపంచ స్థాయి మహా నగరంగా అవతరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు 2024 సంవత్సరానికి పారిశ్రామిక అభివృద్ధి సూచీలో ఏపీ ముందంజలో ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు ఇరువురు మంత్రులు . సీఎం జగన్ విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వారు తేల్చి చెప్పారు . ఆహార ఉత్పత్తులు ,వాణిజ్యం పెంచడంతో వ్యవసాయ రంగ అభివృద్ధికి వైసీపీ సర్కార్ బాటలు వేస్తుందని వారు పేర్కొన్నారు .

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు

రాష్ట్రంలోని 13 జిల్లాల సమాన అభివృద్ధిని సీఎం జగన్ కోరుకుంటున్నారని, అందుకే అభివృద్ధి కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తున్నారని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇక అంతేకాదు విశాఖలో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహకాలు అందించేందుకు సర్కార్ ముందుకు వస్తుందని పేర్కొన్నారు . రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి కేవలం 48 గంటలలో అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.

  Thalapathy Vijay Fans Put Up Posters With AP CM YS Jagan & Prashant Kishore | Oneindia Telugu
  రాజధానిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలోనూ విశాఖ

  రాజధానిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలోనూ విశాఖ

  విశాఖలో భవిష్యత్ లో మంచి పరిశ్రమలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు . ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు . విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్ళాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది చెప్తున్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఇక రాజధానిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలోనూ విశాఖ దూసుకుపోనుంది .

  English summary
  AP ministers Goutham Reddy and Avanti Srinivas participated in Industrial Corridor Conference in Visakha. They said that CM jagan need to develop the industry to the fullest extent by utilizing the good resources of Visakha. AP Executive Capital Vizag will be developed not only as the capital but also as an industrial corridor, AP Ministers mekapati goutham reddy and Avanti Srinivas announced in the conference
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more