వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 స్మార్ట్ సిటీల్లో విశాఖ, కాకినాడ: ప్రయోజనాలివే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వం దేశంలో తొలి విడతలో భాగంగా అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్ సిటీల జాబితాలో ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ నగరాలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గురువారం వెంకయ్య నాయుడు మీడియా సమావేశంలో 20 స్మార్ట్‌ సిటీలను ప్రకటించారు.

స్మార్ట్ సిటీగా ఎంపికయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులను ఈ రెండు నగరాలు సకాలంలో పూర్తి చేయడంతో తొలి విడతలోనే చోటు లభించింది. స్మార్ట్ సిటీలో చోటు దక్కించుకున్న నగరాలను కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలను కల్పించనుంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్' సెట్లో చిరంజీవి (ఫోటోస్)

ఏపీలో జనాభా పరంగా విశాఖపట్నం మొదటి స్థానంలో ఉండగా, కాకినాడ 8వ స్థానంలో ఉంది. స్మార్ట్ సిటీల్లో ఎంపికైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు నిధులు ఇస్తుంది. ఈ నిధులను నీరు, విద్యుత్, సానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్రజా రవాణా, ఐటి కనెక్టివిటీ, ఈ-గవర్నెన్స్ మొదలగు వాటికి వినియోగిస్తారు.

Vizag, Kakinada on Smart Cities List, These are the benefits

స్మార్ట్ సిటీలో విశాఖకు వచ్చే ప్రతిపాదనలు:

* అమెరికా సాయంతో విశాఖను అభివృద్ధి చేస్తారు
* జీవీఎంసీ పరిధిలో సుమారు 1700 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపడతారు
* నగరంలో పదివేల మందికి సరిపడే విధంగా అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మస్తారు
* నగరంలో నిరంతర నీటి సరఫరాకు ప్రతిపాదన
* విశాఖ బీచ్‌లో పీపీపీ పద్ధతిలో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్మాణం

స్మార్ట్ సిటీలో కాకినాడకు వచ్చే ప్రతిపాదనలు:

* స్మార్ట్ సిటీలో భాగంగా కాకినాడ నగరాన్ని జపాన్ సాయంతో అభివృద్ధి చేస్తారు
* కాకినాడలోని కుళాయి చెరువు వద్ద మల్టీప్లెక్స్ థియేటర్లతో కూడిన బిజినెస్ కాంప్లెక్స్ నిర్మాణం
* కాకినాడకు స్మార్ట్‌ సిటీ కింద రూ.200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు నిధులు వచ్చే అవకాశం
* రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా 12వ స్థానంలో ఉన్న నగరాన్ని 7 జోన్లుగా విభజించి అభివృద్ధి
* నగరంలోని వివేకానంద పార్కులో గోదావరి కళాక్షేత్రం నిర్మాణం
* నగరంలోని పాత పురపాలక బిల్డింగ్ ప్రాంతంలో బడ్జెట్‌ హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం.

English summary
Vizag, Kakinada on Smart Cities List, These are the benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X