విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సీతమ్మ ధారకు చెందిన ఆరేళ్ల చిన్నారి అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ అధికారులు పట్టుదల వీడకుండా వెతుకుతూనే ఉన్నారు. మరోవైపు అదితి తండ్రి చాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంత డబ్బైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తన కుమార్తెను ఎవరైనా రక్షించి ఉంటే తనకు అప్పగించాలని కోరుతున్నారు.

ఐదు రోజుల క్రితం విశాఖలో కురిసిన భారీ వర్షం కారణంగా అదితి గల్లంతైన విషయం తెలిసిందే. తన కుమార్తె మృతి చెందిందని నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని శ్రీనివాస్ తెలిపారు. తన కుమార్తె బట్టలు, చెప్పులు, స్కూలు బ్యాగు వంటివేవీ దొరకలేదని ఆయన గుర్తు చేశారు.

దీనిని బట్టి తన కుమార్తె మృతిచెంది ఉంటుందని తాను భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు గెడ్డలు, సముద్రం, తీరం తదితర ప్రదేశాల్లో విస్తృతంగా గాలింపు చర్యరలు చేపట్టినా చిన్నారి అదితి ఆచూకీ లభించలేదు.

ఆఖరి ప్రయత్నంగా సోమవారం ఆపరేషన్ డ్రై డ్రైనేజ్ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న గెడ్డను రెండు బృందాలు పూర్తిగా అణువణువూ శోధించాయి.

ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

నాలుగు రోజులుగా వందలాది మంది కార్మికులు, సిబ్బంది, స్థానికులతో పాటు, జేసీబీలు, పొక్లెయిన్లతో గాలించారు. అదే విధంగా వాసవానిపాలెం తీరం నుంచి రుషికొండ, భీమిలి వరకు సముద్రంలో దాదాపుగా 50 కి.మీ మేర నేవీ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది, స్థానికి మృత్యకారాలు కూడా సముద్రంలో వెతికారు.

 ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

అదితి ఇటు గెడ్డల్లోగానీ, అటు సముద్రంలోగానీ లేదని నేవీ సిబ్బంది తేల్చేశారు. అయినా చిన్నారి కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు సోమవారం ఆఖరి ప్రయత్నంగా గెడ్డల ప్రక్షాళన చేశారు.

 ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

కమిషనర్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ఎంవీపీ కాలనీ సెక్టారు-1 వద్ద నిలిచిపోయిన నీటిని మూడు మోటారు పంపుల ద్వారా బయటకు తోడించారు. చిన్నారి అదితి కాలువలో కొట్టుకుపోయిన ఘటనపై విచారణ జరుపుతున్నామని కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

 ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

ఎంత డబ్బైనా ఇస్తాం, నా కుమార్తెను రక్షించి అప్పగించండి: అదితి తండ్రి

ప్రాధమికదశలో నిర్లక్ష్యం వహించిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, శానిటరీ ఇన్ స్పెక్టర్, సహాయ ఇంజనీరును సస్పెండ్ చేశామని, ఇతర అధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహాయక చర్యలపై చర్చిస్తున్నామన్నారు.

English summary
Vizag Search Operation Continues To Trace 6 Year Old Aditi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X