• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీకి బిగ్ షాక్... వైసీపీ ఎమ్మెల్యేతో ఏడుగురు విశాఖ కార్పోరేటర్ల భేటీ... వివరణ కోరిన పార్టీ అధిష్టానం...

|

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత పతన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2019లో సాధారణ ఎన్నికలు మొదలు తాజా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకూ ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీకి వైసీపీ చేతిలో చావు దెబ్బ తప్పలేదు. పార్టీ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్న వేళ కింది నుంచి పైస్థాయి వరకూ క్యాడర్ అంతా ఢీలా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్లుగా టీడీపీకి మరో షాక్ తగిలింది.

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో ఇటీవల టీడీపీ తరుపున గెలిచిన ఏడుగురు కార్పోరేటర్లు శుక్రవారం(మార్చి 19) గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు. తమ డివిజన్ల పరిధిలో అభివృద్దికి సహకరించాలని ఈ సందర్భంగా కార్పోరేటర్లు ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని... అన్ని డివిజన్ల అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

vizag seven tdp corporators meet ysrcp mla tippala nagireddy tdp seeks explanation

ఎమ్మెల్యేను కలిసినవారిలో 86వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోటేశ్వరరావు, పి.శ్రీను (67వ డివిజన్‌), జి.శ్రీనివాస్ (76వ డివిజన్‌), ముత్యాలనాయుడు (88వ డివిజన్‌), వి.జగన్ (87వ డివిజన్‌)‌, లక్ష్మీబాయి (75వ డివిజన్‌), ఆర్‌.శ్రీనివాస్‌(79వ డివిజన్‌) ఉన్నారు.

మరోవైపు ఈ పరిణామంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో ఎందుకు భేటీ అయ్యారో వివరణ ఇవ్వాలని కోరింది. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వనిపక్షంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులైన గడవకముందే టీడీపీ కార్పోరేటర్లు ఇలా వైసీపీ ఎమ్మెల్యేని కలవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైన వేళ... గెలిచిన కొద్దిపాటి కార్పోరేటర్లు కూడా పార్టీ ఫిరాయిస్తారేమోనన్న టెన్షన్ టీడీపీలో అలజడి రేపుతోంది.

కాగా,ఇటీవలి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. మొత్తం 98 స్థానాల్లో 58 చోట్ల గెలుపొంది గ్రేటర్‌ పీఠంపై పార్టీ జెండా ఎగరవేసింది. 30 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.విశాఖ మేయర్‌ అభ్యర్థిగా గొలగాని వెంకట హరికుమారిని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్న కార్పోరేటర్ వంశీకృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు.

English summary
The seven corporators who recently won from TDP in Greater Visakhapatnam Municipal Corporation (GVMC) met YSRCP MLA Thippala Nagireddy on Friday (March 19) in Gajuwaka. The corporators on the occasion asked the MLA to co-operate for development within their divisions. He also responded positively. He said that politics is only during elections ... He will give his contribution for the development of all divisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X