వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్, పవర్ రద్దు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తన నియోజక వర్గంలోని బార్లు, వైన్ షాపుల యజమానులు హద్దుమీరితే సహించబోనని వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన నియోజక వర్గంలో 50కుపైగా బార్లు, వైన్ షాపుల్లో నిబంధనలను అతిక్రమించి విక్రయాలు సాగిస్తున్నాయన్నారు.

అధిక ధరకు మద్యం విక్రయించడమే కాకుండా రాత్రి పదిగంటల తర్వాత వాటిని కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. చిన్నపిల్లలతో మద్యం విక్రయాలు జరుగుతున్నా, ఎక్జైజ్ శాఖ పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు ఏర్పాటు కాలేదని, పరిశుభ్రత లేనే లేదని ఆయన అన్నారు.

గుడికి, బడికి 200 మీటర్లకు దూరంలో వైన్ షాపులు ఏర్పాటు కావాల్సి ఉన్నా, ఆ నిబంధనలేవీ అమలు కాలేదన్నారు. కేజీహెచ్‌కు, కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న వైన్ షాపుపై చర్యలు తీసుకోవాలని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.

ఇటీవల వన్ టౌన్‌లోని ఒక బార్‌కు 15 ఏళ్ల లోపు పిల్లలకు మద్యం విక్రయించడమే కాకుండా బార్‌లో కూర్చోబెట్టి వారిని తాగించారన్నారు. తాగిన మత్తులో గొడవపడిన ఒక బాలుడు గాయపడి కోమాలోకి వెళ్లిన దుస్దితి ఏర్పడిందన్నారు.

గత పదిరోజులుగా వైన్ షాపులను, బారులను తాను స్వయంగా వెళ్లి పరిశీలించడమే కాకుండా వైన్ షాపుల తీరుపై వీడియో తీసినట్లు చెప్పారు. అలాగే వారి వద్ద నుంచి మద్యం కూడా కొనుగోలు చేశారన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లను ప్రభుత్వం ఒకపక్క నిషేధిస్తే, మరో పక్క వైన్ షాపు యజమానులు వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎక్కువ ధర కలిగిన మద్యం బాలిల్‌లో తక్కువ ధర కలిగిన మద్యం నింపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల ఆగడాలను ఎక్సైజ్ అధికారులు అడ్డుకోకపోతే కోర్టుకి వెళతానని హెచ్చరించారు.

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు: అయ్యన్నపాత్రుడు

వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్

వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్

తన నియోజక వర్గంలోని బార్లు, వైన్ షాపుల యజమానులు హద్దుమీరితే సహించబోనని వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన నియోజక వర్గంలో 50కుపైగా బార్లు, వైన్ షాపుల్లో నిబంధనలను అతిక్రమించి విక్రయాలు సాగిస్తున్నాయన్నారు.

 వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్

వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్

అధిక ధరకు మద్యం విక్రయించడమే కాకుండా రాత్రి పదిగంటల తర్వాత వాటిని కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. చిన్నపిల్లలతో మద్యం విక్రయాలు జరుగుతున్నా, ఎక్జైజ్ శాఖ పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు ఏర్పాటు కాలేదని, పరిశుభ్రత లేనే లేదని ఆయన అన్నారు.

 వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్

వైన్‌షాప్ ఓనర్లకు వార్నింగ్

గుడికి, బడికి 200 మీటర్లకు దూరంలో వైన్ షాపులు ఏర్పాటు కావాల్సి ఉన్నా, ఆ నిబంధనలేవీ అమలు కాలేదన్నారు. కేజీహెచ్‌కు, కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న వైన్ షాపుపై చర్యలు తీసుకోవాలని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు

గ్రామాల్లో పరిశుభ్రత కోసం వచ్చే ఏడాది జూన్ లోగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేస్తామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విశాఖ జర్నలిస్టుల ఫోరంలో గురువారం ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' లో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి తాగునీరు, రహదారులు, విద్యుత్తు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

 డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు

సంపదను సృష్టించేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దుతామన్నారు. పంచాయితీ రాజ్ పరిధిలో ఉన్న 76వేల కిలోమీటర్ల రహదారుల్లో చాలా వరకు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీటీ రోడ్లను పునరుద్దరించి, మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా, గ్రావెల్ రోడ్లను మెటల్ రోడ్లుగా అభిచేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు

డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్ రద్దు

రైతులకు టేకు, మామిడి లాంటి మొక్కలను ప్రభుత్వం ఉచితంగా సరఫారా చేసి, దిగుబడి వచ్చేంత వరకు ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ఏడాదికి 2 లక్షల మొక్కలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకు, లంబసింగివంటి ప్రాంతాలకు పర్యాటక ప్యాకేజిలు అవరసమని అభిప్రాయపడ్డారు.

గ్రామాల్లో పరిశుభ్రత కోసం వచ్చే ఏడాది జూన్ లోగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయకపోతే సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేస్తామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విశాఖ జర్నలిస్టుల ఫోరంలో గురువారం ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' లో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి తాగునీరు, రహదారులు, విద్యుత్తు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

సంపదను సృష్టించేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దుతామన్నారు. పంచాయితీ రాజ్ పరిధిలో ఉన్న 76వేల కిలోమీటర్ల రహదారుల్లో చాలా వరకు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీటీ రోడ్లను పునరుద్దరించి, మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా, గ్రావెల్ రోడ్లను మెటల్ రోడ్లుగా అభిచేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

రైతులకు టేకు, మామిడి లాంటి మొక్కలను ప్రభుత్వం ఉచితంగా సరఫారా చేసి, దిగుబడి వచ్చేంత వరకు ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ఏడాదికి 2 లక్షల మొక్కలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకు, లంబసింగివంటి ప్రాంతాలకు పర్యాటక ప్యాకేజిలు అవరసమని అభిప్రాయపడ్డారు.

ఉష్ణోగ్రత తక్కువ ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఆపిల్ సాగుపై అవగాహన తీసుకొస్తామన్నారు. గోవా రాష్ట్రంలో మాదిరిగానే తీరప్రాంత నియంత్రణ మండలి నిబంధనలను సవరించాలన్నారు. కేబినెట్ సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుతో తనకెలాంటి విభదాల్లేవి కేవలం అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు.

గ్రంధాలయ సంస్ద స్దలాన్ని ప్రయివేట్ వ్యాపారానికి ఉపయోగించాలని యత్నించడంతో అడ్డుకున్నానని, నర్సీపట్నంలో రైతుల నుంచి సేకరించిన ఆర్టీసీ కాంప్లెక్స్ స్దలాన్ని ప్రయివేట్ వ్యాపారం కోసం కేటాయిస్తామంటే అడ్డుకున్నానని అన్నారు.

నర్సీపట్నం జూనియర్ కళాశాల్లో విద్యార్దినులకు బోధించాల్సిన అధ్యాపకులు కొందరు కామపిశాచుల్లా తయారయ్యారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్, ఆర్ జేడీకి ఫిర్యాదు చేసిననా స్పందించలేదన్నారు.

English summary
visakapatnam south mla vasupalli ganesh kumar warns to wine shop owners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X