విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలరోజుల బిడ్డతోనే కరోనా విధుల్లోకి- విశాఖలో మహిళా అధికారి నిబద్ధతపై ప్రశంశలు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లక్షల సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న త్యాగాలను చూస్తూనే ఉన్నాం. స్పెయిన్ వంటి యూరప్ దేశాల్లో వెంటిలేటర్ల కొరత కారణంగా యువతకు భవిష్యత్తు నిచ్చేందుకు వయోవృద్ధులు ప్రాణత్యాగాలకు కూడా సిద్దమవుతున్న కథలు వింటున్నాం. కానీ తాజాగా అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ విధుల్లోకి నెల రోజుల బిడ్డతోనే హాజరవుతున్న ఓ మహిళా అధికారి ఉదంతం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమవుతోంది.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby
 ఏపీలో కరోనా విజృంభణ.. డాక్టర్ల సేవలు..

ఏపీలో కరోనా విజృంభణ.. డాక్టర్ల సేవలు..

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా జనమంతా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్దితి. అయితే రోగులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్ కూడా ప్రాణాలు పణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి సెల్యూట్ చేశారు. దాదాపు ఇదే రకమైన నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.

 జీవీఎంసీ కమిషనర్ సృజన...

జీవీఎంసీ కమిషనర్ సృజన...

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న సృజన సైతం డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఏమాత్రం తగ్గని రీతిలో మరో త్యాగానికి సిద్దమయ్యారు. నెల రోజుల బిడ్డను ఎత్తుకుని కరోనా విధుల్లోకి వచ్చేశారు. క్షేత్రస్దాయిలో అత్యంత ప్రమాదకర పరిస్ధితులు నెలకొన్న నేపథ్యంలో తన ఆఫీసు నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలో అధికారులను సమన్వయం చేస్తూ కరోనాపై పోరును ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో ఇప్పుడు విశాఖలో కరోనా పరిస్దితి దాదాపు నియంత్రణలో ఉందంటే ఇప్పుడు సృజన చేపట్టిన చర్యలే కారణమనేంతగా మారింది.

 నెల రోజుల క్రితం డెలివరీ.. సెలవు తీసుకోకుండానే..

నెల రోజుల క్రితం డెలివరీ.. సెలవు తీసుకోకుండానే..

నెల రోజుల క్రితం రవితేజ, సృజన దంపతులకు మగబిడ్డ పుట్టింది. ఆమెకు ఆరు నెలల పాటు మెటర్నిటీ సెలవు తీసుకునేందుకు కూడా వీలుంది. అయినా దాన్ని నిరాకరించి విధులు నిర్వర్తించేందుకే ఆమె మొగ్గు చూపారు. బిడ్డను చంకలో పెట్టుకునే రోజూ ఆఫీసుకు వస్తూ కరోనా విధుల్లో బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ప్రచారానికి దూరంగా ఉంటారని పేరున్న సృజన ఇప్పుడు అనుకోకుండా ప్రచారం లభించిన ప్రచారంతో కాస్త ఇబ్బందిగానే ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త రవితేజ హైకోర్టు న్యాయవాది. విశాలాంధ్ర మహాసభ సభ్యుడు కూడా. రవితేజ నుంచి లభించిన ప్రోత్సాహమే ఆమెను విధుల వైపు నడిపిస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

English summary
andhra's visakhapatnam municipal commissioner srujana draws attention as she is attending coronavirus duties with her one month baby. after delivery govt issued orders for emergency duties but she might take maternity leave. but srujana refused to take the leave and attending covid 19 duty with heavy risk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X