ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకోనన్న పవన్ కల్యాణ్ ఎక్కడా..?

వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు సర్కార్ స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్దమే నడించింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

వారికి చంద్రబాబుతో సహా కూటమి నేతలు సైతం గట్టిగానే కౌంటరిచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10,000 చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అందరు అనుకున్నట్టుగానే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ వాలంటీర్ల విషయంలో ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదని చెప్పుకొచ్చారు.

volunteers are angry with Chandrababu s government

దాంతో ప్రభుత్వం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని మంత్రి చెప్పడం విశేషం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వాలంటీర్లు ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో వారికి కేటాయించిన యాప్‌లో హాజరు చేసుకుంటారు.ఈ యాప్ నుంచి వాలంటీర్లను తొలగించారు. దీంతో... ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు వాయిదాల పద్దతిలో ముగింపు పలికారు. దీనిపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మహిళా వాలంటీర్లు విజయవాడలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఓ మహిళ వాలంటీర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తాము కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

గతంలో కూడా తాము లేమని కానీ జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ కోసం జీవో తీసుకువచ్చారని, ఇప్పుడు మీరు కూడా జగన్ మాదిరిగానే మా కోసం జీవో తీసుకురావచ్చు కదా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్‌ తీరును ఎండగట్టారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకోనని పవన్ కల్యాణ్ చెప్పారని, తాము ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నారంటూ మహిళా వాలంటీర్లు ప్రశ్నించారు.

రూ.5000 అని చిన్న చూపు చూస్తున్నారని, అవే రూ.5000 రూపాయిలతో మా కుటుంబాన్ని ముందుకు నడుపుకున్నామని వాలంటీర్లు తెలిపారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు తమ ఇళ్లకు ఒకటికి పదిసార్లు తిరిగి ఓటు వేయమని అడిగారని, జీతం రూ.10,000 చేస్తారని అబద్దపు మాటలు చెప్పారని , ఇప్పుడు వాళ్లు ఎవరూ కనిపించడం లేదని వాలంటీర్లు వాపోయారు.

జీవో లేకపోతే మాకు జీతాలు ఎలా ఇచ్చారని, ప్రభుత్వపు యాప్‌ల్లో తమ పేర్లు ఎలా నమోదు చేశారని వాలంటీర్లు ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా మా సేవలను వినియోగించుకున్నారని వారు తెలిపారు. విజయవాడలో భారీ వరదలు వచ్చిన సమయంలో అర్థరాత్రి 12 గంటలకు ఫోన్లు చేసి తమ సేవలు కావాలని అడిగినప్పుడు తాము జీవోలో లేమని గుర్తుకు రాలేదా అని వాలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాకు న్యాయం చేయకపోతే నిరసలను మరింత ఉదృతం చేస్తామని వాలంటీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+