• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మ‌రో సారి తెర‌పైకి ఓటుకు నోటు : అయిదు కోట్ల‌కు నేనే ఒప్పించా: కొత్త వీడియో తో సంచ‌ల‌నం..!

|

నాలుగేళ్ల నాటి ఓటు కు నోటు వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది. ఒక వైపు డేటా చోరీ కేసు ఏపి -తెలం గాణ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్దానికి కార‌ణంగా మారుతోంది. ఇదే స‌మ‌యంలో ఓటు కు నోటు వ్య‌వ‌హారం పై ఓ జాతీయ పత్రి క ఓ సంచ‌ల‌న క‌ధ‌నాన్ని ప్ర‌చురించింది. త‌మ వ‌ద్ద 11 నిమిషాల వీడియో ఉంద‌ని పేర్కొంది. ఇప్పుడు ఇది మ‌రో సారి సంచ‌ల‌నంగా మారుతోంది.

<strong>బాల‌కృష్ణ అక్క‌డి నుండే : జేసి బ్ర‌దర్స్ దూరం : ప‌రిటాల శ్రీరాం కు అవకాశం లేన‌ట్లే..!</strong>బాల‌కృష్ణ అక్క‌డి నుండే : జేసి బ్ర‌దర్స్ దూరం : ప‌రిటాల శ్రీరాం కు అవకాశం లేన‌ట్లే..!

జాతీయ మీడియా క‌ధ‌నంతో..

జాతీయ మీడియా క‌ధ‌నంతో..

2015 లో చోటు చేసుకున్న ఓటు కు నోటు వ్య‌వ‌హారం పై ఇప్పుడు ఓ జాతీయ దిన ప‌త్రిక ఓ క‌ధ‌నం ప్ర‌చురించింది. అందులో కొన్ని ఆస‌క్తి క‌ర విష‌యాల‌ను బ‌య‌ట పెట్టింది. అప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు టిడిపి నేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్ కు పెద్ద మొత్తంలో న‌గ‌దు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. అది అప్పుడు వ్యూహాత్మ‌కంగా తెలంగాణ ఏసిబి ముందుగానే కెమేరాలు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. అదే స‌మ‌యంలో టిడిపి అధినేత వాయిగా ప్ర‌చారం లో ఉన్న ఆ ఆడియో టేపు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ఉన్న‌ది ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వాయిస్ అంటూ టిఆర్‌య‌స్‌..వైసిపి నేత‌లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ లు చేసారు. ఇది ప్ర‌స్తుతం ఇడి వ‌ద్ద విచార‌ణ‌లో ఉంది.

కొత్త పేర్ల ప్ర‌స్తావ‌న‌.. క‌ల‌క‌లం..

కొత్త పేర్ల ప్ర‌స్తావ‌న‌.. క‌ల‌క‌లం..

ఆ వీడియో చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఓ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లో భాగంగా ఏసిబి అధికారులు స్టీఫెన్‌స‌న్ నివాసంలో ముందుగానే మూడు కెమేరాల‌ను ఏర్పాటు చేసారు. అయితే, సెల్‌ఫోన్ ద్వారా మ‌రో వీడియో చిత్రీక‌ర‌ణ జ‌రిగిదంటూ 11 నిమిషాల వీడియోను ఆ ప‌త్రిక ప్ర‌స్తావించింది. అందులో రేవంత్‌రెడ్డి తో పాటుగా స‌బాస్టియెన్ నేరుగా స్టీఫెన్‌స‌న్‌తో జ‌రిపిన సంభాష‌ణ‌ల ను చూపించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ వీడియో లో సెబాస్టియెన్ మాట్లాడుతూ బాబు మీకు 3.5 కోట్లు మాత్ర‌మే ఇవ్వ‌మ‌ని చెప్పార‌ని..అయితే నేనే ఆయ‌న‌ను ఒప్పించి అయిదు కోట్ల‌కు తీసుకొచ్చాన‌ని సెబాస్టియ‌న్ చెప్పిన‌ట్లుగా పేర్కొంది. అయితే, బాబు అని ప్ర‌స్తావించ‌టం మిన‌హా అక్క‌డ ఎవ‌రి పేరు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ లేదు.

క‌మిష‌న్ కోరిన సెబాస్టియ‌న్‌

క‌మిష‌న్ కోరిన సెబాస్టియ‌న్‌

స్టీఫెన్‌స‌న్ తో డ‌బ్బుల అంశం పై సెబాస్టియెన్ బేరాలు చేసిన‌ట్లు ఆ ప‌త్రిక పేర్కొంది. తార్నాక లోని మాల్కం టేల‌ర్ నివాసంలో ఈ వ్య‌వ‌హారం మొత్తం జ‌రిగింద‌ని.. టిడిపి అభ్య‌ర్దికి అనుకూలంగా ఓటు వేయాల‌ని కోరారు. ఒక వేళ తెలం గాణ‌లో న‌ష్టం జ‌రిగితే ఏపిలో ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇస్తామ‌ని స్టీఫెన్‌స‌న్ కు హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో మిగిలిన మొత్తాన్ని స్టీఫెన్‌స‌న్ ద్వారా పంపిస్తామ‌ని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన‌ట్లుగా ప‌త్రిక పేర్కొంది. సెబాస్టియ‌న్ క‌మిష‌న్ కోరి నట్లుగా వివ‌రించింది. ఈ వీడియో మొత్తంగా 11 నిమిషాలు ఉంద‌ని..అందులో ఏసిబి అధికారులు రంగం ప్ర‌వేశం.. రేవంత్ రెడ్డిని ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకొనే వ‌ర‌కూ ఈ వీడియో లో ఉంద‌ని ప‌త్రిక వివ‌రించింది.

English summary
Once again Vote for Note case came in to discussion. One national daily given a story on this issue. In that deal another recorded video released by that news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X