వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం: ఏసిబికి చిక్కి ముఖం చాటేశాడు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో సర్వేయర్‌గా పనిచేస్తున్న కర్రి శివశంకర్‌ప్రసాద్‌ ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. నగరంలో శివాజీపాలేనికి చెందిన పాలెపు సుధాకుమార్‌ పద్మనాభం మండలం పొట్నూరులో ఆయిల్‌ మిల్లు పెట్టేందుకు అనుమతి కోసం జిల్లా పరిశ్రమల కేంద్రానికి గత ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

సింగిల్‌ విండో కింద ఆ ఫైల్‌ వుడాకు వచ్చింది. స్థలాన్ని పరిశీలించి రిపోర్టు ఇవ్వాల్సిన సర్వేయర్‌ శివశంకరప్రసాద్‌ 15 రోజుల నుంచి తిప్పించుకుంటున్నాడు. రూ.25 వేలు లంచంగా ఇస్తే పని జరుగుతుందని సుధాకుమార్‌కు స్పష్టంచేశాడు. ఆఖరుకి రూ.20 వేలుకు అంగీకరించాడు. అందులో రూ.10 వేలు మొదట ఇస్తానని సుధాకుమార్‌ చెప్పగా ఒప్పుకున్నాడు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని సుధాకుమార్‌ ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో శుక్రవారం మధ్యాహ్నం శివశంకర ప్రసాద్‌ తన సీట్లో కూర్చునే రూ.10 వేలు లంచం తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ డీఎస్‌పీ నరసింహారావు సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు రమణమూర్తి, రామకృష్ణ, గణేశ్‌ పాల్గొన్నారు.

శివశంకర ప్రసాద్‌ జేబులో లంచంగా తీసుకున్న రూ.10 వేలు నగదు దొరకడంతో కేసు నమోదు చేశామని, శనివారం రిమాండ్‌కు పంపుతామని ఏసీబీ డీఎస్‌పీ నరసింహారావు తెలిపారు. ఇంత వరకు శిశంకరప్రసాద్ సంపాదించిన ఆస్తులు, ఇతర డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు పరిశీలిస్తున్నారు.

ఏసిబి

ఏసిబి

విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో సర్వేయర్‌గా పనిచేస్తున్న కర్రి శివశంకర్‌ప్రసాద్‌ ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఏసిబికి చిక్కాడు

ఏసిబికి చిక్కాడు

నగరంలో శివాజీపాలేనికి చెందిన పాలెపు సుధాకుమార్‌ పద్మనాభం మండలం పొట్నూరులో ఆయిల్‌ మిల్లు పెట్టేందుకు అనుమతి కోసం జిల్లా పరిశ్రమల కేంద్రానికి గత ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

ఐడి కార్డ్

ఐడి కార్డ్

సింగిల్‌ విండో కింద ఆ ఫైల్‌ వుడాకు వచ్చింది. స్థలాన్ని పరిశీలించి రిపోర్టు ఇవ్వాల్సిన సర్వేయర్‌ శివశంకరప్రసాద్‌ 15 రోజుల నుంచి తిప్పించుకుంటున్నాడు.

నగదు స్వాధీనం

నగదు స్వాధీనం

రూ.25 వేలు లంచంగా ఇస్తే పని జరుగుతుందని సుధాకుమార్‌కు స్పష్టంచేశాడు. ఆఖరుకి రూ.20 వేలుకు అంగీకరించాడు.

ముఖం చాటేస్తూ..

ముఖం చాటేస్తూ..

అందులో రూ.10 వేలు మొదట ఇస్తానని సుధాకుమార్‌ చెప్పగా ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సుధాకుమార్‌ ఏసీబీని ఆశ్రయించాడు.

ముఖం చాటేస్తూ..

ముఖం చాటేస్తూ..

శివశంకర ప్రసాద్‌ జేబులో లంచంగా తీసుకున్న రూ.10 వేలు నగదు దొరకడంతో కేసు నమోదు చేశామని, శనివారం రిమాండ్‌కు పంపుతామని ఏసీబీ డీఎస్‌పీ నరసింహారావు తెలిపారు.

ముఖం చాటేస్తూ..

ముఖం చాటేస్తూ..

ఇంత వరకు శిశంకరప్రసాద్ సంపాదించిన ఆస్తులు, ఇతర డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు పరిశీలిస్తున్నారు.

English summary
Anti-Corruption Bureau (ACB) sleuths caught a VUDA surveyor redhanded while he was accepting a bribe from a person at the VUDA office here Friday. The surveyor demanded money for approving a land clearance application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X