వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం వైఎస్ జగన్‌ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో: ఉండవల్లి హెచ్చరికలు, రాష్ట్ర స్థితిపై ఆందోళన

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాజెక్టు సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి కమిటీలు వేసి ముందుకు వెళ్లాలని సూచించారు. లేదంటే కేంద్రం విభేదించాల్నారు.

జగన్ సర్కారుకు హెచ్చరిక

జగన్ సర్కారుకు హెచ్చరిక

అంతేగాక, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. 22 మంది ఎంపీలే ఉన్నామనుకుంటూ పోతే.. ఎప్పటికీ ఏమీ చేయలేరని ఉండవల్లి వ్యాఖ్యానించారు. మొత్తం 540 ఎంపీల్లో.. ఏపీ నుంచి ఉన్న 25 మంది ఎంపీలు ఓ లెక్కా అంటూ అన్నారు.

వైఎస్ జగన్‌కు చురకలు..

వైఎస్ జగన్‌కు చురకలు..

కేంద్రం ఇచ్చిన మాట తప్పితే నిలదీయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఎందుకని ఉండవల్లి నిలదీశారు. అడుగుతూ ఉంటాం.. ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు.. వాళ్లకు మెజార్టీ సీట్లు వచ్చాయంటూ వ్యాఖ్యలు చేస్తే కుదరదని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చురకలంటించారు. అలా కుదిరితే పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు 25 ఏళ్లు పరిపాలించలేకపోయేవారన్నారు. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయని, ఆ నిబంధనలు అమలు చేయించుకోకపోతే అది మనతప్పేనని అన్నారు. బీజేపీకి మెజార్టీ వచ్చిందని, హోదా గట్టిగా అడగలేమని జగన్ ఎన్నికల అనంతరం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర పరిస్థితి చూస్తేనే భయంగా..

రాష్ట్ర పరిస్థితి చూస్తేనే భయంగా..


త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని.. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనే భయంగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాబడి పడిపోయిందని, నోట్ల రద్దు తర్వాత దేశంలో కూడా అదే పరిస్థితి ఉందని అన్నారు. దేశ జీడీపీ 4 శాతానికి వచ్చిందని తెలిపారు. నోట్ల రద్దు ప్రభావం దేశంపైన ఉందని, అది రాష్ట్రంపైనా పడుతుందని చెప్పారు.

జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకో..

జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకో..

కేంద్రం రాష్ట్రాల దగ్గర పన్నుల రూపంలో తీసుకొని.. ఇచ్చే మొత్తాన్ని 42 శాతం నుంచి 41 శాతంకు తగ్గిస్తామన్నారని ఉండవల్లి తెలిపారు. అక్కడ ఆదాయం పడిపోయి.. ఇక్కడ ఆదాయం పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. రాష్ట్రం స్టాండ్ స్టిల్‌కు రాకుండా నడవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు మాట తప్పడు.. మడమ తిప్పడు అనే నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు ఓటేశారని.. వైఎస్ జగన్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

English summary
Former MP Vundavalli arun kumar key suggestions and warnings to cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X