• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ తెరపైకి ‘మార్గదర్శి’ కేసు: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, రామోజీరావుపై ఉండవల్లి ఏమన్నారంటే.?

|

న్యూఢిల్లీ: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు ముగిసిందనుకున్న ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అంతేగాక, ఈ కేసు విచారణలో మార్గదర్శితోపాటు ఏపీ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ హయాంలో.. మార్గదర్శిపై ఉండవల్లి ఫిర్యాదు..

వైఎస్ హయాంలో.. మార్గదర్శిపై ఉండవల్లి ఫిర్యాదు..

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మార్గదర్శిగా ఫైనాన్సియర్స్ ఛైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్స్ పేరిట చిట్టీలు నిర్వహించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో చోటు చేసుకున్న అవకతవకలను గుర్తించినట్లు పేర్కొన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రామోజీరావు జైలుకు వెళ్లడం తప్పేట్టు లేదని ప్రచారం జరిగింది. అయితే, వైఎస్ మరణాంతరం ఈ కేసులో విచారణ దాదాపు నిలిచిపోయినట్లు కనిపించింది.

తాజాగా సుప్రీంకోర్టు విచారణ.. ఆదేశాలు జారీ

తాజాగా సుప్రీంకోర్టు విచారణ.. ఆదేశాలు జారీ

కాగా, రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి.. రిజర్వు బ్యాంక్ ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

దోషిగా తేలితే.. భారీ జరిమానా.. జైలు కూడా

దోషిగా తేలితే.. భారీ జరిమానా.. జైలు కూడా

ఈ క్రమంలో మార్గదర్శి కేసుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ కుమార్ మీడియాకు వెల్లడించారు. చట్ట ముందు అందరూ సమానులేనని, ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చొకుని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ(హెచ్‌యూఎఫ్) యిన మార్గదర్శి ఫైనాన్షియర్స్.. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేశారని మాజీ ఎంపీ తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలితే.. ఆర్బీఐ నిబంధనల మేరకు భారీ జరిమానా విధిస్తుందన్నారు. వసూలు చేసిన దానికంటే రెండున్నరరేట్లు జరిమానా(సుమారు రూ.7వేల కోట్లు) విధించే అవకాశం ఉందన్నారు. అంతేగాక, రెండున్నరేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వివరించారు.

తెలంగాణతోపాటు ప్రతివాదిగా ఏపీ కూడా..

తెలంగాణతోపాటు ప్రతివాదిగా ఏపీ కూడా..

కాగా, మొదట కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారని, ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేర్చాలని తాము విజ్ఞప్తి చేయడంతో కోర్టు స్వీకరించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ. 2300 కోట్లు వసూలు చేశారన్నారు. దీనిపై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా కక్షగట్టారని ఆరోపిస్తూ రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. దీంతో రామోజీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజశేఖర్ రెడ్డి పేరును వాడటానికి వీల్లేదని, ముఖ్యమంత్రి అనే పేరు వాడాలని సూచించింది. అనంతరం కేసుపై కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగవంటూ ఉండవల్లి..

క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగవంటూ ఉండవల్లి..

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, తాను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు మంచి ఉత్తర్వులు ఇచ్చిందని ఉండవల్లి తెలిపారు. ఏపీ ప్రభుత్వాన్ని, నాటి విచారణాధికారి కృష్ణంరాజును ఈ పిటీషన్‌లో పార్టీలుగా చేశారని తెలిపారు. రిజిర్వు బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారని చెప్పారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులున్నాయని తెలిపారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా? లేదా? అనే పరిశీలన కూడా అడ్డుకుంటున్నారని, డిపాజిట్లు వెనక్కి ఇచ్చినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని చెప్పారు. ఈ కేసుపై విచారణ కోర్టులో నిబంధనల ప్రకారం జరగాలని వివరించారు.

English summary
Former MP Vundavalli Aruna Kumar explain about Ramoji Rao's Margadarsi Finance Case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X