వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ తెలివైనవాడు, బాబును పిలవకపోవడానికి రాజకీయ కారణం ఉండొచ్చు: ఉండవల్లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: కెసిఆర్ తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన ఏ పనిచేసినా దాని వెనుక ఏదో కారణముంటుందని రాజమండ్రి మాజీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు మహసభలకు చంద్రబాబునాయుడును పిలపకపోవడం కూడ రాజకీయపరమైన కారణం ఉండి ఉంచవచ్చని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ తెలుగు మహసభలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తొలుత ఆహ్వనించాలని భావించినట్టు ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో బాబును పిలవకూడదని నిర్ణయించుకొన్నారని తేలింది. అయితే తెలుగు భాషకు సేవ చేసిన వారిని ఈ సభలకు ఆహ్వనించినట్టు నందిని సిద్దారెడ్డి ప్రకటించారు. అయితే రాజకీయ కోణంలో దీన్ని ఆయా పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్‌కుమార్ తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ప్రపంచ తెలుగు మహసభల్లో ఎన్టీఆర్‌ ను గుర్తుకు తీసుకురాకపోవడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. తెలంగాణ టిడిపి నేత ఒకరు ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు.

 రాజకీయ కోణం ఉండొచ్చు

రాజకీయ కోణం ఉండొచ్చు

ప్రపంచ తెలుగు మహసభలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వనించకపోవడం వెనుక రాజకీయపరమైన కారణం ఉండి ఉండొచ్చని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కెసిఆర్ చాలా తెలివైన రాజకీయ నాయకుడని ఆయన గుర్తు చేశారు.అయినా ఏపీ టిడిపి నేతలు ఈ సభలకు హజరయ్యారని చెప్పారు. అంటే రాజకీయంగా చంద్రబాబుకు కూడ ఎలాంటి ఇబ్బంది లేదని భావించి ఉంటారని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.అయితే ఎందుకు ఈ మహసభలకు చంద్రబాబును పిలవలేదో అర్ధం కావడం లేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు.

ఎన్టీఆర్ ఫోటో పెట్టాలి

ఎన్టీఆర్ ఫోటో పెట్టాలి

ప్రపంచ తెలుగు మహసభల్లో ఎన్టీఆర్‌ను విస్మరించడం సరైంది కాదన్నారు. ఎన్టీఆర్ ఫోటోను పెట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌పై కెసిఆర్‌కు కోపం ఉంటుందని తాను భావించనని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.ఎన్టీఆర్‌ పేరును విస్మరించడంపై తెలంగాణ టిడిపి నేత చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు.

అధికారంలోకి రావడం కూడ వ్యాపారమే

అధికారంలోకి రావడం కూడ వ్యాపారమే

అధికారంలోకి రావడం కూడ వ్యాపారమేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు రాజకీయమంతా ఏపీలోనే, తెలంగాణలో బాబు రాజకీయాలు లేవన్నారు. కెసిఆర్‌కు ఏపీలో రాజకీయాలు అవసరం లేదన్నారు. ఇది కూడ కారణమై ఉండొచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రావడం కూడ ఓ వ్యాపారని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

 బాబుపై కెటిఆర్ పొగడ్తలు

బాబుపై కెటిఆర్ పొగడ్తలు

హైద్రాబాద్‌లో సాప్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటు విషయంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీసుకొన్న చొరవ విషయాన్ని కెటిఆర్ ప్రశంసించడం జీఈఎస్ సదస్సులో బ్రహ్మణి హజరుకావడం తదితర అంశాలను ప్రస్తావించారు ఉండవల్లి అరుణ్‌కుమార్.

English summary
Former MP Vundavalli Arun Kumar said Telangana Chief Minister K Chandrashekar Rao has not invited AP Chief Minister N Chandrababu Naidu due to political reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X