నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ : మరో వివాదంలో ఏపీ ఎన్నికలు ! రొడ్డున పడ్డ వీవీప్యాట్ స్లిప్పులు ..!

|
Google Oneindia TeluguNews

ఇక వైపు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై అనుమానాలు వ్య‌క్తం అవుతుంటే..మ‌రో వైపు వివి స్లిప్పులు ఓ పాఠశాల వ‌ద్ద దొర‌క‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న పై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌ల నిర్వ హ‌ణ లో ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైందంటూ టిడిపి అధినేత చంద్ర‌బాబు మూడు రోజులుగా ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఈ స‌మ‌యంలోనే ఇలా వీవీ ప్యాట్స్ స్లిప్పులు దొర‌క‌టం పై విచార‌ణ ప్రారంభ‌మైంది..

ఆత్మ‌కూరు లో క‌ల‌క‌లం..
నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు లోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల లో ఈవీయం ల‌తో పాటుగా ఉండే వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘ‌ట న క‌ల‌క‌లం సృష్టించింది. ఎన్నిక‌ల్లో ఇవియం లో వేసిన ఓటు ఎవ‌రికి వేసామో మ‌రో సారి చెక్ చేసుకొనేందుకు వీలుగా ఈ వీవీ ప్యాట్స్ ను ఏర్పాటు చేసారు. ఆత్మ‌కూరు పాఠ‌శాల ప్రాంగ‌నంలో దాదాపు 200 కు పైగా వీవీ ప్యాట్ స్లిప్పులు విద్యార్దుల కు దొరికాయి. వెంట‌నే స్థానిక రిట‌ర్నింగ్ అధికారికి స‌మాచారం అందించారు.

అక్క‌డ‌కు వెళ్లిన ఆర్వో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్లిప్పులు పోలింగ్ సిబ్బందికి ఈవీఎం ల వినియోగానికి సంబంధించి శిక్ష‌ణ ఇచ్చిన స‌మ‌యంలో విని యోగించిన స్లిప్పులు గా రిట‌ర్నింగ్ అధికారి గుర్తించారు. అయితే, నిబంధ‌న‌లు ప్ర‌కారం శిక్ష‌ణ ఇచ్చిన స‌మ‌యంలో వాడి న వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను సైతం భ‌ద్ర‌ప‌ర్చాల్సి ఉంటుంది. దీంతో..ఇలా ఓ పాఠ‌శాల‌లో వీవీ ప్యాట్స్ స్లిప్పులు దొర‌క‌టం పై వివ‌ర‌ణ కోర‌టంతో పాటుగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేసారు.

VV pats slips found in Atmakuru in Nellore dist : Collector ordered for detailed report

ఎన్నిక‌ల సంఘం పై ఆగ్ర‌హం..
ఇప్ప‌టికే రెండు ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల సంఘం విష‌యంలో రెండు గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్ర బాబు పోలింగ్ ముందు రోజు నుండి ఎన్నిక‌ల సంఘాన్ని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఎన్నిక‌ల సంఘం తీసుకున్న అధి కారు ల బ‌దిలీ నిర్ణ‌యాల నుండి.. ఇవియం ల స‌మ‌స్య‌ల వ‌ర‌కు అన్నింటిలోనూ ఎన్నిక‌ల సంఘం తీరును త‌ప్పు బ‌డుతున్నా రు. ఎన్నిక‌ల సంఘం ఇవియం ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌కుండా ఓట‌ర్లను యాచ‌కులుగా చూస్తుందం టూ విరుచుకు ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో వీవీ ప్యాట్స్ ను 50 శాతం మేర లెక్కించాల‌ని డిమాండ్ చేసారు. దీని కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇక‌, వైసిపి మాత్రం ఎన్నిక‌ల సంఘం స‌మర్ధ‌వంతంగా ప‌ని చేసింద‌ని కితాబిస్తున్నారు. ఎన్నిక‌ల సంఘం స‌మ‌ర్ద‌వంతంగా ప‌ని చేయ‌టం వ‌ల‌నే భారీ స్థాయిలో పోలింగ్ జ‌రిగింద ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై వివాదం సాగుతున్న ఈ స‌మ‌యంలో ఆత్మ‌కూరు లో బ‌య‌ట ప‌డిన వీవీ ప్యాట్స్ స్లిప్పుల వ్య‌వ‌హారం పై మ‌రింగ ర‌గ‌డ సాగే అవ‌కాశం క‌న‌పిస్తోంది.

English summary
VV pat slips found in a school in Atmakur in Nellore dist. Local Returning officer says these slips belong to training slips. Dist collector ordered for enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X