వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి వివి వినాయక్ సోదరుడు, టిలోను పోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

VV Vinayak joins in YSR Congress
రాజమండ్రి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ప్రముఖ దర్శకులు వివి వినాయక్ సోదరుడు సురేంద్ర కుమార్ చేరారు. సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వినాయక్ సోదరుడు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సురేంద్ర కుమార్ ఇప్పటి వరకు చాగల్లు మండలంలో కాంగ్రెసు నాయకుడుగా ఉన్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప కుటుంబం మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ముత్యాలపాప, ఆమె భర్త వెంకటరమణ మూర్తి తదితరులు సోమవారం శ్రీకాకుళం వెళ్లి తమ వియ్యంకుడు కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద రావుతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ను కలిసి ఆ పార్టీ కండువా వేయించుకోవడానికి సిద్ధపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, కర్రి సీతారామ్ కూడా కాంగ్రెస్‌ను వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.

ఎల్లారెడ్డి నుండి జగన్ పార్టీ పోటీ?

తెలంగాణ ప్రాంతంలో ఉనికి కోల్పోతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి మాత్రం ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకుల్లో నుండి ఒక్కర్ని ఎట్టి పరిస్థితుల్లో పోటికి దింపాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందట.

ఆ పార్టీ సెగ్మెంట్ ఇన్‌చార్జిగా పెద్దపట్లోళ్ల సిద్దార్థ రెడ్డి ఆ పార్టీకి సెగ్మెంట్‌లో పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చారు. అనుకోని సంఘటనల వల్ల కొన్ని నెలల పాటు సిద్దార్థరెడ్డి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సిద్దార్థ రెడ్డికి బాధ్యతలు అప్పగించి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుండి ఆయన్ను పోటీకి దింపాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

English summary
Director VV Vinayak brother Surendra Kumar joined in YSR Congress Party on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X