వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో వీవీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్ చేసిన వెంకయ్య నాయుడు... ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

తిరుమల VVIP దర్శనాలపై వెంకయ్య షాకింగ్ కామెంట్స్ || Oneindia Telugu

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన వీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు మీడియా తో మాట్లాడారు.

<br>మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్వామీజీకి ఆహ్వానం ? అందుకేనా జగన్ విశాఖ పర్యటన
మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్వామీజీకి ఆహ్వానం ? అందుకేనా జగన్ విశాఖ పర్యటన

కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

వైకుంఠం1 క్యూ కాంప్లెక్స్ ద్వారా వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు భారత ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు.ఇవాళ ఉదయం వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన‌ మీడియాతో మాట్లాడారు. యాధ్బావం తద్భవతి అన్న ఆయన దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు.ఆకలి అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలని తానూ కాంక్షిస్తున్నట్టు వెల్లడించారు .

వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటే మంచిదన్న వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటే మంచిదన్న వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని.. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. అలా సంవత్సరానికి ఒక్కమారు దర్శించుకుంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించిన వారు అవుతారని దీనిని ప్రముఖులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరిస్తే బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు , ఎప్పుడూ తను కూడా అదే విధంగా ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. అదే పనిగా వీవీఐపీలు వస్తుంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రెండో సారి దర్శనం చేసుకోవాలనుకుంటే సాధారణ భక్తుల్లా వెళ్లాలని ఆయన సూచించారు. భారతదేశం మంచి అభివృద్ధి పథంలో నడుస్తోందన్న వెంకయ్య నాయుడు అభివృద్ధి ఫలాలు అందరికి అందేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ప్రకృతి కరుణించి, సకాలంలో వర్షం కురిసి, ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలని ఆయన కోరుకున్నారు. సాత్మర్గంలో అందరిని నడిపించమని కోరుకున్నానని ఆయన తెలిపారు .

రాజకీయాల్లో లేను, భవిష్యత్ రాజకీయాల్లోకి రాను .. ఇక చాలు అన్న ఉపరాష్ట్రపతి

రాజకీయాల్లో లేను, భవిష్యత్ రాజకీయాల్లోకి రాను .. ఇక చాలు అన్న ఉపరాష్ట్రపతి

ప్రపంచ మానవాళి సుఖఃసంతోషాలతో జీవించాలని, అసమానతలు, ఘర్షణలు, అత్యాచారాలు,అవినీతి, లేని మార్గాన్ని చూపించాల్సిందిగా స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. రాజకీయాల్లో లేను, భవిష్యత్ లో రాజకీయాల్లోకి రాను అన్న ఆయన ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేస్తున్న అనేక సమావేశాలకు కూడా వెళ్తున్నానని, ప్రపంచ స్థాయిలో అసమానతలు తగ్గి అరాచకం పై ఉక్కు పాదం మోపే విధంగా ప్రజా అభిప్రాయాన్ని సేకరించే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకున్నట్లు వెంకయ్య తెలిపారు.

English summary
The Vice President of India, M. Venkaiah Naidu had darshan of Lord Sri Venkasteswara along with his wife Ushamma and other family members, in Tirumala today. After the darshan, the Vice President said that he wished to see India as a developed nation and attain its rightful place in the comity of nations. He prayed for realizing the same wish. The Vice President said that he prayed for the Lord’s blessings for universal peace and a world free of conflicts, inequalities, corruption, hunger and poverty. Naidu said that he had been visiting various countries and participated in several international fora aimed at promoting world peace. He prayed to the Lord to give strength to the society for eliminating all forms of discrimination and inequalities.Naidu said that everyone was equal before the Lord and should get opportunity to have the darshan. He suggested that all VVIPs should volunteer to visit Tirumala only once a year so that no inconvenience was caused to the devotees. This was only an advice, he added.Naidu said that if any VVIP wanted to visit a second time, he or she should not avail of the VVIP facility and visit as an ordinary devotee.The Vice President said that he has been visiting Tirumala once every year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X